పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ ను ఇంటికి పంపాలని ప్రజలు నిర్ణయించటంతో వైసీపీ ఫేక్ పరిశ్రమను తెర పైకి తెచ్చిందని ఆరోపించారు. వైసీపీ ఫేక్ పరిశ్రమలో తప్పుడు వీడియోలు సృష్టిస్తూ.. ప్రజల్ని గందరగోళం సృష్టించాలని చూస్తోందని తెలిపారు. వైసీపీ ఫేక్ ప్రచారాలను ధీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. ఫేక్ ప్రచారానికి కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోను సైతం వదలట్లేదని ఆరోపించారు.
Ambati Rambabu: వాలంటీర్లకు రూ.10 వేలు జీతం ఇస్తామనడం ఎన్నికల స్టంట్ కాదా..?
వాలంటీర్లతో తప్పుడు పనులు చేయించి జైలుకు పంపాలని జగన్ చూస్తున్నాడని చంద్రబాబు తెలిపారు. వాలంటీర్లను ఐదేళ్ల బానిసలుగా మార్చి ఊడిగం చేయించుకున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు మనం పదివేలు ఇస్తామంటే తట్టుకోలేకపోతున్నాడని తెలిపారు. వైసీపీ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి అని పార్టీ ముఖ్యులకు చెప్పారు. కూటమి అభ్యర్థి ఎవరైతే అతనికి మూడు పార్టీల ఓట్లు పడేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు కోరారు.
Sujana Chowdary: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక మినీ ఇండియా..
తాను, పవన్ కళ్యాణ్ కలిసి నిర్వహించిన రోడ్ షోకు ప్రజా స్పందన సూపర్ సక్సెస్ అని పేర్కొన్నారు. తణుకు సభతో తాడేపల్లి ప్యాలెస్ వణికిందని అన్నారు. నిడదవోలు రోడ్ షో వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేసిందని విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు అందరం కలిసి ఇష్టపడుతూ కష్టపడితే ఊహించని ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రతీ కుటుంబ సాధికార సభ్యులు.. ఈ 32 రోజుల్లో రోజుకు 50 ఇళ్లు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించాలని చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో పార్టీ ముఖ్య నేతలకు సూచించారు.