చేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ జి.రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. అర్హులైన ప్రతి ఇంటికి ఆరు గ్యారంటీలను అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆయన సతీమణి, టీటీడీ బోర్డు మెంబర్ గడ్డం సీతారెడ్డి పేర్కొన్నారు. బుధవారం వారు శంషాబాద్ మండలం నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. తొలుత ఆమె సీతారామస్వామిని అమ్మపల్లి ఆలయంలో దర్శించుకున్నారు. అనంతరం నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు…
విల్లు, బాణం ఆకారంలో 'గ్లాస్ బ్రిడ్జ్' ఇండియాలోని ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఈ వంతెనను చిత్రకూట్‌లోని తులసి (షబ్రి) జలపాతం వద్ద నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. కోదండ అడవుల్లో ఉన్న జలపాతంపై రూ.3.70 కోట్లతో శ్రీరాముడి విల్లు, బాణం ఆకారంలో ఈ వంతెనను నిర్మిస్తున్నారు. అయితే.. ఈ వంతెనను లోక్‌సభ ఎన్నికల తర్వాత పర్యాటకుల కోసం ప్రారంభించనున్నారు. రానున్న కాలంలో ఇది అత్యంత అందమైన ఎకో టూరిజం కేంద్రంగా మారనుంది. మరోవైపు.. పర్యాటకుల కోసం…
భారతదేశంలో క్రికెట్‌ను ఒక మతంగా పరిగణిస్తారు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులు తమ అభిమాన క్రికెటర్లను 'దేవుడు'తో పోలుస్తారు. కాగా.. అలాంటి దృశ్యం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నిన్నటి మ్యాచ్‌లో టాస్ సమయంలో సన్‌రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మాట్లాడుతుండగా ఓ అభిమాని అతడికి హారతి ఇచ్చాడు. ఈ వీడియోకు బాహుబలిలోని 'దండాలయ్యా' అనే పాటను యాడ్ చేసి 'ఎక్స్' లో షేర్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ…
కష్టాలు చుట్టుముట్టిన అరవింద్ కేజ్రీవాల్‌కు ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో.. అరవింద్ కేజ్రీవాల్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం తన పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో వేగంగా వస్తున్న కారు.. బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది.
గాంధీ భవన్లో జరిగిన పంచాంగ శ్రవణంలో 350 నుంచి 4వందల స్థానాలు కైవసం చేసుకుని మూడోసారి ప్రధాని అవుతారని పంచాంగ కర్తలు స్పష్టం చేశారని, కాంగ్రెస్ పార్టీ 543 స్థానాల్లో సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ.సుభాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిగతా సీట్లను మిత్రపక్షాలను కట్టబెట్టిందన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎట్లా అవుతారో కాంగ్రెస్ నేతలు…
త్వరలో బండి సంజయ్ అవినీతిని బయటపెడతాం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ రాముని ఫోటోలు పెట్టి రాజకీయం చేయడం సరికాదని.. బండి…
మద్యం కుంభకోణంలో తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ క్రమంలో.. మంగళవారం కేజ్రీవాల్ భార్య సునీత తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారు. కేజ్రీవాల్ తన భార్య ద్వారా మరోసారి సందేశం పంపారు. ముఖ్యమంత్రి రెండు సందేశాలపై మంత్రి గోపాల్ రాయ్ బుధవారం విలేకరులతో మాట్లాడారు. అరవింద్ కేజ్రీవాల్ మాకు రెండు సందేశాలు అందించారని ఆప్ నేత పేర్కొన్నారు.
ఫిరోజ్ ఖాన్ అంటేనే ఓవైసీకి వ్యతిరేకం.. ఆ వ్యక్తి కాంగ్రెస్ అసలు రంగు బయట పెట్టారని, ఓవైసీ హైదరాబాద్ లో గెలవాలని కాంగ్రెస్ అధిష్టానం కోరుకుంటుందని ఫిరోజ్ ఖాన్ చెప్పారన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని పాలించిన అన్ని పార్టీలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంఐఎంను పెంచి పోషించారని, మజ్లిస్, కాంగ్రెస్ అనేక సార్లు కలిసి పని చేశాయన్నారు ప్రకాష్ రెడ్డి. ఎవ్వరికీ ఎవ్వరూ బీ టీమ్ అర్థమైందని, టగ్రెస్…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారన్నది కోర్టు ముందు కేజ్రీవాల్ వాదన వినిపించారు. అనంతరం.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.