రైతులు ఎవరు అధైర్యపడొద్దు జిల్లా యంత్రాంగంతో మాట్లాడి మార్కెట్ యార్డ్ లోనే PACS ధాన్యం కొనుగోలు సెంటర్‌ని ప్రారంభించినమన్నారు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తొందరపడి దళారులకు అమ్ముకొని మోసం మోసపోవద్దన్నారు. తేమ పేరుతో రైతులను దళారులు,అధికారులు కలిసి దోచుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తేమ శాతం ఉన్నవాటికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదని, నాలుగు రోజులుగా వ్యవసాయ మార్కెట్లో కపాల కాస్తున్న రైతులు ఎక్కడ వర్షాలు వస్తాయని భయపడి దళారులకు అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తానని బుకాయించిందని, ప్రభుత్వం రైతుని పట్టించుకోవడం లేదు,రైతులకు మద్దతు ధర వచ్చేవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు.
సామరస్యానికి సర్వ మానవ సమానత్వంనకి ప్రతీక రంజాన్ పండుగ అని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా కేంద్రమైన జనగాంలో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పర్వదినాన్ని శాంతి, పరస్పర సహకారం, ఐకమత్యంతో జరుపుకోవాలన్నారు. ఈ సందర్భంగా జనగాం నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.