తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కొట్లాడి 1000 కోట్ల నిధులు తెచ్చానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లు తప్పుడు ప్రకటనలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి సుప్రీంకోర్టులో కొత్త అఫిడవిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఈ అఫిడవిట్లో ఆర్డర్‌ను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించి పతంజలి వివరణాత్మక సమాధానం దాఖలు చేసింది.
మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో ఎంపీ సైమన్ హారిస్ ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. 37 ఏళ్ల వయసులోనే ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు.
వరకట్న వేధింపుల చట్టం దుర్వినియోగంపై కర్ణాటక హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వరకట్న వేధింపుల కేసుల్లో తమ భర్త బంధువులపై ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా చాలాసార్లు మహిళలు ఇరికిస్తున్నారని కోర్టు తన తీర్పులో పేర్కొంది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను పట్టి పీడిస్తున్న భూతాల్లో ‘డ్రగ్స్’ ఒకటి. ముఖ్యంగా.. యువతీ యువకులు ఈ డ్రగ్స్‌కు బానిసలై, తమ ఉజ్వల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇది చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ.. దుండగులు అడ్డదారుల్లో ఈ డ్రగ్స్‌ని సరఫరా చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో ఎండీఎంఏ డ్రగ్స్‌ను రాజేంద్రనగర్ ఎస్వోటీ టీమ్ సీజ్ చేసింది.
తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TS TET 2024) దరఖాస్తు గడువు నేటితో(ఏప్రిల్ 10) ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకూ దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ ఈ సందర్భంగా పేర్కొంది.
క్రోధి నామ సంవత్సరంలో కోపం తగ్గించుకొని కార్యకర్తలంతా పాజిటివ్ దృక్పథంతో పనిచేయాలని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ ఆయన ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయన్నారు. ప్రజల అభీష్టం మేరకు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అద్భుతంగా పాలన కొనసాగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతీ కార్యకర్త…
ప్రజలకు ఉగాది క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సంవత్సరం అందరికి మంచే జరిగి అభివృద్ధి చెందాలని భగవంతుణ్ని కోరుకుంటున్నట్టు చెప్పారు. మన ప్రాంతాన్ని,మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం శ్రమ పడాలని సూచించారు. అందరికి శుభం జరిగి ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని పొన్నం తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి ప్రకటన ఇప్పుడు ఈ క్షణము రేపు ఎల్లుండి వరకు రావచ్చని, పార్లమెంట్ స్థానిక…
డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక.. డోర్ టూ డోర్ వెళ్లడం మా తొలి ప్రణాళిక అని, పెద్దగా సభలు పెట్టాలని అనుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. బీజేపీ గెలవాలి.. మోడీ ప్రధాని కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోలింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర అధ్యక్షుడిగా, నేను అభ్యర్ధిగా ఉన్నాను సో అందరిని కో ఆర్డినేట్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్…