ఖమ్మంలో బుధవారం ‘కార్బైడ్ రహిత మామిడి మేళా’ను వనజీవి రామయ్య ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి చెందిన రైతు బానోతు లక్ష్మణ్‌నాయక్ పెవిలియన్ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న మేళాలో సహజసిద్ధంగా పండిన వివిధ రకాల మామిడి పండ్లను సరసమైన ధరలకు ప్రజలకు అందిస్తున్నారు. మేళాను ప్రారంభించిన అనంతరం రామయ్య మాట్లాడుతూ కార్బైడ్ రహిత మామిడి పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిదని, కృత్రిమ పదార్థాలతో పండిన మామిడి పండ్లను నివారించాలని, అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని…
చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్మోహన్ రెడ్డి పని చేశారు.. సుమారు 2000 కోట్ల రూపాయలతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసామని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తెలిపారు. గురజాల నియోజకవర్గంలో ఇంటింటికి కులాయి కార్యక్రమం 50 శాతం పూర్తి చేయగలిగాం.. మరొక 50 శాతం ప్రాజెక్టు పూర్తి చేస్తే నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించవచ్చు అని పేర్కొన్నారు. పిడుగురాళ్ల ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు, బైపాస్ నిర్మాణాలు చేశాం.. సంక్షేమ కార్యక్రమాలకు వైసీపీ ప్రభుత్వం…
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి కోసం కన్న కొడుకు, కూతురును కడతేర్చింది ఓ తల్లి. ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు పిల్లలు అడ్డుకుంటున్నారని.. ఈ క్రమంలో 5 ఏళ్ల బాలిక, 3 ఏళ్ల బాలుడును కొట్టి చంపింది. ఈ ఘటన రాయ్‌గఢ్ జిల్లాలో జరిగింది. కాగా.. ఈ ఘటనపై నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రియుడితో పెళ్లి చేసుకుందామని, పిల్లలు అడ్డుకుంటున్నారని యువతి పోలీసులకు తెలిపింది. ఈ మేరకు బుధవారం పోలీసులు సమాచారం అందించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీ నోటి చేత పచ్చి అబద్ధాలు మాట్లాడించారన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాపం రాహుల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెప్పితే అది మాట్లాడి పోయాడని, బీఆర్ఎస్ హయంలోనే 503 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం….. వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారన్నారు. నిరుద్యోగులు ఇవ్వన్ని గమనిస్తున్నారని, టెట్ పరీక్ష…
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ‘ముస్లిం లీగ్ ముద్ర’ ఉందని బీజేపీ పదే పదే ఆరోపణలు గుప్పిస్తుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ అధికార (బీజేపీ)పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయ వేదికలపై పదే పదే అబద్ధాలు చెప్పడం వల్ల చరిత్ర మారదని తెలుసుకోవాలని రాహుల్ అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ.. పంజాబ్ లో మరో 4 స్థానాలను పెండింగ్ లో ఉంచారు. ఆ నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటనపై సీఎం భగవంత్ మాన్ ఎప్పుడు ప్రకటిస్తారో చెప్పారు. జలంధర్, లూథియానా స్థానాలకు అభ్యర్థులను ఈ రోజున ప్రకటిస్తుందని సీఎం భగవంత్ మాన్ 'X' లో సమాచారం ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలో గణేష్ గడ్డ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకట్ రామి రెడ్డి, పటన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గణేశ్ గడ్డ బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన అడ్డ అని…
భారత రాజ్యాంగం ప్రకారం మనది లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామ్య దేశం. ఇందులో మొదటిదైన లౌకిక అనే పదానికి విస్తృత అర్థాన్ని ప్రబోధించారు రాజ్యాంగకర్తలు. మతం అనేది వ్యక్తిగతం, ఎవరికి నచ్చిన మతాన్ని వారు అనుసరించొచ్చు, దాన్ని ఆచరించవచ్చు. కానీ ఇతరుల మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వారి మత విశ్వాసాలకు భంగం కలిగించకూడదు. ఇదే రకంగా ప్రభుత్వం కూడా అన్ని మతాలనూ సమ దృష్టితో చూడాలి. అదే సమయంలో మతాన్ని రాజకీయాలతో ముడి పెట్టకూడదు. మతం విషయంలో…
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావు పై మంత్రి సీతక్క తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫిరాయింపులను ప్రోత్సహించింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు. రేగా కాంతారావు ను కాంగ్రెస్ గెలిపిస్తే పార్టీ ఫిరాయించింది నిజం కాదా అని ఆమె అన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ ఫిరాయించారని అంటున్న రేరా కాంతారావు చేసింది ఏమిటి… నువ్వు ఫిరాయిస్తే అభివృద్ధి కోసం వేరే వాళ్ళ పై విమర్శలు చేసే అర్హత రేగా కాంతారావు…
ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో ఓ హత్య కేసులో నిందితుడు.. 26 ఏళ్లుగా వెతుకుతున్న 50 ఏళ్ల మిత్లేషియా ఉత్తమ్ పటేల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 1999లో రాజ్‌కోట్‌లోని జెట్‌పూర్‌లోని టైల్స్ ఫ్యాక్టరీలో ఓ వాచ్మెన్ ను హత్య చేశాడు. ఈ కేసులో మిత్లేషియా పటేల్‌ను నిందితుడిగా చేర్చారు. కాగా.. ఈ ఘటనపై క్రైమ్ ప్రివెన్షన్ బ్రాంచ్ విచారణ చేపట్టింది.