గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం కచ్చితంగా స్ఫూర్తిదాయకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నగరంలో ప్రధాన కూడళ్లు, చెక్‌పోస్టులు, పబ్బులు, క్లబ్బుల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం నగరంలోని ఏదో ఒక చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో గురువారం భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అంబర్ పేట్ అలీ కేఫ్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.
పాకిస్థాన్ సైన్యం ప్రస్తుతం సొంత ప్రజలపైనే అకృత్యాలకు పాల్పడుతోంది. ఈసారి పాక్ ఆర్మీ క్రూరత్వానికి బలి అయినది మరెవరో కాదు.. సొంత దేశ పోలీసులే. పాకిస్థాన్ సైన్యం పంజాబ్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అక్కడ ఉంచిన పోలీసులను కొట్టి రక్తస్రావం చేసింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సాయంత్రం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా, ఈ పండుగ కరుణ, ఐక్యత, శాంతి స్ఫూర్తిని వ్యాప్తి చేయాలని ప్రధాని మోడీ ప్రార్థించారు.
రాష్ట్రంలో భానుడు భగభగ మండిపోతున్నాడు. సూర్య ప్రతాపంతో ఎండ వేడికి తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు పైనే నమోదవుతోంది. అయితే తెలంగాణలో గత మూడు రోజులుగా వాతావరణ పరిస్థితి మారింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా.. రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఉత్కంఠభరిత విజయం సాధిచింది. ఈ మ్యాచ్ లో 3 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపొందింది. 197 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్.. ఆఖరి బంతికి టార్గెట్ ను చేధించింది. చివరలో రషీద్ ఖాన్ (24), రాహుల్ తెవాటియా (22) రాణించడంతో విక్టరీ సాధించింది.
రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పాఠశాలల్లో అత్యవసర నిర్వహణ పనులు, వడదెబ్బ నివారణ చర్యల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈరోజు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో తాగునీటి పరిస్థితిని నిశితంగా పరిశీలించి, నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అద్భుతమైన టీమ్ వర్క్ చేసినందుకు జిల్లా కలెక్టర్లను ఆమె అభినందించారు. వేసవిలో నీటి ఎద్దడి నివారణకు కలెక్టర్ల వద్ద తగినన్ని నిధులు అందుబాటులో ఉంచామని ఆమె అన్నారు.…
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియా బాద్ లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. తర్వాత ఏమీ ఎరుగనట్లు అనుమానం రాకుండా సదరు మహిళ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు పెట్టింది. కాగా.. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు.. అసలు విషయాలను బయటకు రాబట్టారు.
ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు గుజరాత్ టైటాన్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ (76), సంజూ శాంసన్ (68) చెలరేగి ఆడటంతో.. రాజస్థాన్ భారీ స్కోరు చేసింది.