టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లాలో 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అంబటి తెలిపారు. ప్రతి పేదవాడి గుండెను తట్టి చూసినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని అంటున్నారని చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే సీఎంగా జగన్ పనిచేశారని కొనియాడారు. ప్రతిపక్ష నాయకులు చెబుతున్న మాటలు ప్రజలు నమ్మరు... నిన్నటిదాకా వాలంటీర్ల వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒక్క రోజులో…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతి బా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు లక్ష్మణ్ హాజరై.. మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతి బా పూలే ఆశయాలకు అనుగుణంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పదేళ్లుగా సామాజిక న్యాయాన్ని మోదీ అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మహాత్మా జ్యోతి బా పూలే…
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ పైలా సోమి నాయుడు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలను చూశా... ప్రపంచం మొత్తం తిరిగానన్నారు. కృష్ణా జిల్లా నా పుట్టినిల్లు.. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగడాన్ని భగవంతుడి వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.…
ఉగ్రవాదం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. పాక్‌పై మరోసారి రక్షణ మంత్రి తన మాటలతో దాడి చేశారు. దాయాది దేశం పాకిస్థాన్‌కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు సహకరించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఉన్నారు.
ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది.
రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలో రంజాన్ వేడుకలను ఘనంగా జరుగుతున్నాయి. ముస్లిం సోదరులు.. నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు పాల్గొని వారితో కలిసి నమాజ్ చేశారు. ఈ సందర్భంగా.. పిల్లలతో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు.