World Earth Day 2024: ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. భూమి మానవులకే కాదు లక్షలాది జంతువులు, మొక్కలకు నిలయం.. కానీ మానవులు తమ అవసరాలను తీర్చుకోవడానికి భూమికి అనేక రకాల హాని కలిగిస్తున్నారు. దీని వల్ల వరదలు, కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ వంటి అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యలు పట్టించుకోకపోతే భవిష్యత్తులో మరెన్నో ప్రమాదాలకు కారణం కావచ్చు. భూమి, ప్రకృతి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ఎర్త్ డే జరుపుకుంటారు.
Read Also: KRMB: జీతాలు చెల్లించలేని పరిస్థితిలో కేఆర్‌ఎంబీ.. నేడు బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం
ఎర్త్ డే ఎలా ప్రారంభమైంది?
1969లో యునెస్కో సదస్సులో శాంతి కార్యకర్త జాన్ మెక్‌కానెల్ తొలిసారిగా ఎర్త్ డే జరుపుకునే ఆలోచనను ప్రతిపాదించారు. ప్రారంభంలో, ఈ రోజును జరుపుకోవడం ఉద్దేశం భూమిని గౌరవించడమే. ఏప్రిల్ 22, 1970న మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్‌లో ఎర్త్ డే జరుపుకున్నారు. 1990లో, డెన్నిస్ హేస్ 141 దేశాలు పాల్గొన్న ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు. 2016 సంవత్సరంలో ఎర్త్ డే వాతావరణ పరిరక్షణకు అంకితం చేయబడింది. ప్రస్తుతం, ఎర్త్ డే నెట్‌వర్క్ 190 దేశాలలో 20,000 మంది భాగస్వాములు, సంస్థలను కలిగి ఉంది.
ప్రపంచ ఎర్త్ డే 2024 థీమ్
ప్రతి సంవత్సరం ప్రపంచ భూమి దినోత్సవాన్ని ఒక థీమ్‌తో జరుపుకుంటారు. 2024 సంవత్సరంలో దీని థీమ్ – ‘ప్లానెట్ వర్సెస్ ప్లాస్టిక్’ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని అంతం చేయడం, దాని ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణపై దృష్టి పెట్టడం. 2023 సంవత్సరం థీమ్ “మన గ్రహంలో పెట్టుబడి పెట్టండి”.
ఎర్త్ డే జరుపుకోవడానికి కారణం
ఎర్త్ డే రోజున, కాలుష్యం వల్ల కలిగే ప్రమాదం, అటవీ నిర్మూలన వంటి పర్యావరణ సమస్యల గురించి చర్చించడానికి మిలియన్ల మంది ప్రజలు కలిసి వస్తారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల సహాయంతో పర్యావరణం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ భూమిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అవగాహన కల్పించారు.