కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుంది..
కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందని, 2 లేదా 3 సీట్లు బీజేపీ గెలుస్తుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంతేకాకుండా.. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడ నుంచి కేసీఆర్ బస్సు యాత్ర( KCR Bus Yatra ) చేపడుతున్నారని ప్రశ్నించారు. దేశంలో మత ఘర్షణలు చెలరేగేలా మోదీ మాట్లాడటం బాధాకరమని చెప్పారు.మొదటి దశ ఎన్నికల్లో ఇండియా కూటమికే( INDIA Alliance ) ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తర భారత్ లో బీజేపీ పరిస్థితి బాగలేదన్న మంత్రి కోమటిరెడ్డి అందుకే దక్షిణ భారత్ పై ఫోకస్ పెట్టారని తెలిపారు.బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారన్న ఆయన తాను పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని తెలిపారు. నల్లొండ , భువనగిరిలో కేసీఆర్, కేటీఆర్ ఎంత ప్రచారం చేసిన కూడా డిపాజిట్ కూడా రాదన్నారు. ఇప్పటికైన, కేసీఆర్ తన ప్రవర్తన మార్చుకొవాలని హితవు పలికారు. అదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటీ మహేశ్వర్ రెడ్డిపై కూడా మంత్రి కోమటి రెడ్డి మండిపడ్డారు.
నూడుల్స్‌లో బంగారం, వజ్రాలు.. నలుగురు అరెస్ట్
ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ భారీగా వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు నూడుల్స్ ప్యాకెట్లలో వజ్రాలను, తమ శరీరంపై ఉన్న బట్టల్లో బంగారాన్ని దాచి తీసుకువస్తున్నట్లు సమాచారం. రహస్య సమాచారం అందుకున్న కస్టమ్స్ శాఖ దాడులు నిర్వహించి రూ.6.46 కోట్ల విలువైన వజ్రాలు, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టులో పట్టుబడిన వ్యక్తులు తమ వెంట 6.815 కిలోల బంగారాన్ని తీసుకువచ్చారని, దీని విలువ రూ.4.44 కోట్లు. వారి నుంచి రూ.2.02 కోట్ల విలువైన వజ్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ ప్రకారం, ముంబై నుండి బ్యాంకాక్ వెళ్తున్న భారతీయ పౌరుడిని ఆపి అతని ట్రాలీ బ్యాగ్‌లో ఉంచిన నూడుల్స్ ప్యాకెట్ నుండి వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. దీని తర్వాత కొలంబో నుంచి ముంబై వస్తున్న ఓ విదేశీ జాతీయుడిని బంగారు కడ్డీలతో అరెస్ట్ చేశారు. బంగారాన్ని లోదుస్తుల్లో దాచుకున్నాడు.
అన్నా రాంబాబు నామినేషన్తో మార్మోగిన మార్కాపురం
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా అన్నా రాంబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఇక, అన్నా రాంబాబు నామినేషన్తో మార్కాపురం మార్మోగిపోయింది. అట్టహాసంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో వేలాది మందితో భారీగా ర్యాలీతో వెళ్లారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవే.. నా లక్ష్యం అని ఆయన చెప్పుకొచ్చారు. అన్నా రాంబాబు నామినేషన్ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
మేడిగడ్డ కుంగడంలో ఎవరిది తప్పని ఇప్పటికి తేల్చలేదు..
మేడిగడ్డ కుంగడంలో ఎవరిది తప్పని ఇప్పటికి తేల్చలేదని కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. గంగ నుండి కావేరీ వరకి నదులని అనుసంధానం ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. నీటి పంపకాలు ఇంకా జరగలేదన్నారు. గోదావరినదిలో తెలంగాణ వాటా సంగతి ఏమిటి? ఇచ్చంపల్లి వద్ద డ్యాం కట్టుతామంటే మేము అడ్డుకున్నామన్నారు. నలుగురు బీజేపీ ఎంపీల స్పందన ఏమిటన్నారు. 1985లో ఇచ్చంపల్లి ప్రాజెక్టు పై ఎన్టీఅర్ హయంలో సర్వే చేసారన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుని చత్తీస్ ఘడ్ వ్యతిరేకించిందన్నారు. గంగ నుండి మహానదికి ఇంకా సర్వేనే జరుగలేదన్నారు.
ఇందిరమ్మకు ఉన్న చరిత్ర.. మోడీ, అమిత్ షాలకు ఉందా?
ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోడీ, అమిత్ షాలకు ఉందా? అని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసింది అని మాట్లాడుతున్నాయి.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడు.. కేసీఆర్ కుటుంబం అంతా సెట్ అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఏం చేసింది అనేది ఊత పదం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా..? అని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆరేళ్ళ జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు.
దేశంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు మోడీకే..
శోభా యాత్రలతో భారతదేశంలో సంస్కృతీ, సాంప్రదాయాలు పెంపొందడంతో పాటూ దేశ భక్తి కూడా పెరుగుతుందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ లో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ..చేవెళ్ల ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. యువతలో భక్తి భావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నమన్నారు. 15 ఏళ్లుగా శంషాబాద్ లో శోభాయాత్ర నిర్వహిస్తున్న స్థానిక యువకులను కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభినందించారు. అయితే, ఓ వైపు యువకుల్లో భక్తి భావం పెరుగుతుండగా.. కొందరు దుర్మార్గులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం హనుమాన్ గుడిని కూల్చి వేయడాన్ని తప్పుపట్టారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బలరాం నాయక్ కి మావోయిస్టులు సహకరించాలి.. తుమ్మల సంచలన కామెంట్ ..
మహబూబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ కి మావోయిస్టులు కూడా సహకరించి గెలిపించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరావు సంచల కామెంట్ చేశారు. భద్రాచలంలో కాంగ్రెస్ విజయాన్ని కాంక్షిస్తూ కార్యకర్తల సమావేశంలో తుమ్మల మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ భద్రాచలంలో అనేక అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టులు చంపుతామని బెదిరించినప్పటికీ అభివృద్ధి పనులు చేశామని తుమ్మల నాగేశ్వర చెప్పారు. ప్రాణాలకు లెక్క చేయకుండా పరిపాలన అందించామన్నారు. ఎప్పుడూ కూడా అభివృద్ధిని ఆపలేదని పేర్కొన్నారు. భద్రాచలంలో కమ్యూనిస్టులు గెలుపొందిన సమయంలో కూడా అభివృద్ధిని ఆపకుండా చేశామన్నారు. ప్రజల కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించేది కోసం మావోయిస్టు బలరాం నాయక్ కి మద్దతు ఇవ్వాలని తుమ్మల నాగేశ్వర కోరారు.
పిఠాపురం జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్
ఏపీలో ఎన్నికలు రచ్చ రేపుతున్నాయి. వేసవిలో ఎండకంటే.. రాజకీయాల వేడి ఠారెత్తిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని గద్దెదించేందుకు కంకణం కట్టుకున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేడు పిఠాపురంలో తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఎండిఓ కార్యాలయంలో ఉన్న ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం పిఠాపురం నుంచి చేబ్రోలు వెళ్లిపోయిన పవన్.. సాయంత్రం ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొనున్నారు.
ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు..
నెల్లూరు లోక్ సభ స్థానానికి నామినేషన్ వేయడం నా జీవితంలో మర్చిపోలేని రోజుగా అభివర్ణించారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి.. ఈ రోజు నెల్లూరు లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుట్టి పెరిగిన నెల్లూరు లోక్ సభకు పోటీ చేయడం జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. నెల్లూరు నేలతల్లి రుణాన్ని తీర్పు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవకాశం కల్పించారని.. నెల్లూరు లోక్‌సభ నుంచి ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించారు.. బెజవాడ రామచంద్రా రెడ్డి లాంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు లోక్‌సభ సభ్యుల జాబితాలో నా పేరు కూడా చేరడానికి నెల్లూరు ప్రజలు సువర్ణావకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రజలందరూ జగనన్న వైపే ఉన్నారు.. సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయి
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో.. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ చూడం, కులం చూడం.. జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.. పెత్తందారుల పక్షాన చంద్రబాబు నాయుడు ఉన్నాడని దుయ్యబట్టారు. టీడీపీ ఎన్నారై వింగ్ మీటింగ్లో మాట్లాడిన వీడియో చూపిస్తూ.. మీరు పెత్తందారులు అయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజలను వెధవలతో పోల్చడం దారుణం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజలని వెధవలతో పోల్చడం వారి కుసంస్కారంకు అర్థం పడుతుందని.. ఇలాంటివారిని ఉరితీయాలని అన్నారు.
100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత
100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, డిసెంబర్ 9 తేదీన 6 గ్యారంటీల్లో 13 హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రైతు బంధు ఆపిన ఘనులు వీళ్ళే అని ఆయన అన్నారు. రుణమాఫీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అర్హులైన రైతులందరికీ రైతు బంధు వచ్చిందని నిరూపిస్తే.. మా ఎంపీ అభ్యర్థిని ఎన్నికల బరి నుంచి తప్పిస్తా అని జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉంది.. 2 లక్షల ఎకరాలు ఎండినందుక ఓటు వేయాలా..? అని ఆయన ప్రశ్నించారు. మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేయటంతోనే.. తక్కువ ధరకు ధాన్యం అమ్మల్సిన దుస్థితి అని, ఫ్లోరైడ్ పీడిత జిల్లాను ధాన్యాగారం గా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.