లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పథకాలను నిలిపివేస్తారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు బుధవారం అన్నారు. ఎందుకంటే, తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయకున్నా రేవంత్‌రెడ్డికి ప్రజలు ఓట్లు వేస్తారని భావించి ఎక్కువ సీట్లు వస్తాయన్నారు. ఎస్ నిజామాబాద్‌లో బాజిరెడ్డి గోవర్ధన్‌కు ఓటు వేయాలని కేటీఆర్ ప్రజలను కోరారు. బీఆర్ఎస్ మల్కాజిగిరి అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా జరిగిన రోడ్‌షోలో…
మే 1న ఇళ్ల వద్దనే సామాజిక పెన్షన్ల పంపిణీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవాళ ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువై వడగాల్పులు వీస్తున్నాయన్నారు. రాష్ట్రంలో విధుల్లో ఉన్న సచివాలయ, రెవిన్యూ సిబ్బందితో మే 1న ఇళ్ల వద్దే పెన్షన్లు పంపిణీ చేయించాలని ఆయన కోరారు. సిబ్బంది, నగదు కొరత అనే సాకులు చెప్పకుండా ఇప్పటినుండే తగు చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో విధుల్లో ఉన్న…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. 207 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్.. ఈ మ్యాచ్ లో చతికిలపడింది. 35 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. 6 వరుస ఓటముల తర్వాత బెంగళూరు విక్టరీని నమోదు చేసింది. మొదటగా ఓపెనర్లుగా బరిలోకి దిగిన ట్రావిస్ హెడ్ (1) పరుగు చేసి నిరాశపరిచాడు. అభిషేక్ శర్మ (31) పరుగులు చేసి క్రీజులో ఉన్నంత సేపు…
గత ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది.. కార్ఖానా నుంచి ఇక కారు వాపసు రాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కారు ఇక తుకానికి పోవాల్సిందేనని ఆయన అన్నారు. గద్దరన్నను అవమానించిన ఉసురు తగిలి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందని, పేదల చెమట గిట్టని కేసీఆర్… బస్సు యాత్ర మొదలు పెట్టిండన్నారు రేవంత్ రెడ్డి. బస్సు యాత్ర కాదు.. ఆయన మోకాళ్ల యాత్ర చేపట్టినా తెలంగాణ ప్రజలు నమ్మరని, సినిమా…
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలపై 12 మంది సిబ్బంది, కాంట్రాక్టు ఉద్యోగిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. 2022 నవంబరులో గుడిలో జరిపిన దాడుల్లో, విజిలెన్స్ అధికారులు ఆలయంలోని వివిధ విభాగాలలో అవకతవకలను గుర్తించారు , అవినీతికి పాల్పడిన , విధులను నిర్లక్ష్యం చేసిన కొంతమంది సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ నివేదికను పంపారు.ఈ సిఫార్సు మేరకు ఆలయ అధికారులు ముగ్గురు ఏఈవోలు, నలుగురు సూపర్వైజర్లు,…
ఇటీవల ఓ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో, తాజా బహిరంగ సభలో మాజీ సీఎం కేసీఆర్ ప్రకటనలకు ధీటుగా స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం కోలుకోలేని నష్టాలకు గురి అయింది. వారి అసమర్థత, నిర్లక్ష్యం మూలంగా అప్పుల ఊబిలోకి నెట్టారు. అవరోధాలు అన్నిటిని అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చర్యలు తీసుకుంటున్నాం. రాబోయే 30 ఏళ్లకు రాష్ట్ర ప్రజల విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాటిని…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తూలపూర్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ, ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చూస్తే గల్లపెట్టల్లో పైసలు లేవని, ఎన్నికల హామీలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను 100…
టీమిండియా టార్గెట్ టీ20 వరల్డ్ కప్ గెలవడమే.. ఇప్పటికే రెండు ట్రోఫీలను చేజార్చుకున్న భారత్.. ఈ ట్రోఫీని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో.. జట్టు బలంగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు, ఎక్స్ పర్ట్స్ ఇండియా జట్టు ఎలా ఉండాలో వారి అంచణాను చెబుతున్నారు. తాజాగా.. భారత మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ నవజ్యోత్ సింగ్ సింధు కూడా చేరాడు. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ భారత జట్టు ప్రధాన…
Yadgiri: ఇటీవల కాలంలో చిన్నచిన్న వివాదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా చపాతీ విషయంలో గొడవ ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ ముందు 207 పరుగుల స్కోరును ఉంచింది. ఆర్సీబీ బ్యాటింగ్ లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (51) హాఫ్ సెంచరీతో రాణించాడు. డుప్లెసిస్ (25) పరుగులు చేశాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (6) పరుగులు చేసి తొందర్లోనే పెవిలియన్…