తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల స్వీకరణ రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పులివెందులలో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతోపాటు ఏపీలోని పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు చివరి రోజు నామినేషన్ వేశారు. రెండు రాష్ట్రాల్లో ప్రచారం జోరు పెంచారు.…
ఎన్నికల ప్రచారంలో బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. బీసీ జనార్థన్ రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి, కుమార్తె, కోడలు, సోదరులంతా ఏకమై ఊరూరా ఇంటింటికి తిరుగుతూప్రజలతో మమేకవుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీసీ కుటుంబ సభ్యుల ప్రచారానికి ప్రజల నుంచి ముఖ్యంగా మహిళల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. మరోవైపు.. ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రధాన పార్టీలు టీడీపీ, వైపీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తేన్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా…
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో 30 వైడ్ బాడీ A350-900 విమానాలను ఆర్డర్ చేసింది. అంతర్జాతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఎయిర్‌లైన్స్ గురువారం ఈ ప్రకటన చేసింది. కంపెనీ ప్రస్తుతం నారో బాడీ ఎయిర్‌బస్ విమానాలను మాత్రమే నడుపుతోంది. అయితే.. ఇస్తాంబుల్ మార్గంలో కార్యకలాపాల కోసం టర్కిష్ ఎయిర్‌లైన్స్ నుండి రెండు బోయింగ్ 777 విమానాలను కంపెనీ లీజుకు తీసుకుంది.
నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామన్నారు, ఇది బీజేపీ స్టాండ్ అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో భారతీయులను అభద్రతకు గురి చేసేలా ఉందని, హాల్ సెల్ గా దేశాన్ని ముస్లిం లకు అప్పగిస్తాం అంటోంది కాంగ్రెస్ అని వెల్లడించారు. ముస్లిం ల రిజర్వేషన్లు తీసి ఎస్సి ఎస్టీలకు ఇస్తామని…
ప్రయాణంలో ఆసౌకర్యం కలిగినందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌పై దావా వేశారు తెలంగాణ డీజీపీ రవి గుప్తా. పరిహారంగా రూ.2 లక్షలు తిరిగి అందుకున్నారు. హైదరాబాద్‌లోని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్-III సింగపూర్ ఎయిర్‌లైన్స్‌ను డీజీపీ రవి గుప్తాకి పరిహారంగా ₹2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. తెలంగాణ డీజీపీ రవి గుప్తా, ఆయన భార్య అంజలి గుప్తా మే 23, 2023న హైదరాబాద్ నుంచి సింగపూర్ మీదుగా ఆస్ట్రేలియాకు వెళ్లారు. బిజినెస్ (జెడ్) క్లాస్‌లోని రిక్లైనర్ సీట్లు ఎలక్ట్రానిక్…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మొదట టాస్ గెలిచిన బెంగళూరు.. బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వరుస విజయాలతో దూకుడుగా మీదున్న ఎస్ఆర్హెచ్.. మరోసారి విజయం సాధించేందుకు బరిలోకి దిగుతుంది. ఇటు.. ఆర్సీబీ వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండటంతో.. ఈ మ్యాచ్ లో గెలిచి రివేంజ్ తీర్చుకోవాలని చూస్తోంది.
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అశ్రద్ధ మూలంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఆ పరిస్థితి నుంచి వెలుగుల వైపు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ను నడిపించేందుకు భట్టి విక్రమార్క నడుం బిగించారు. 2023 డిసెంబర్ 7న ప్రమాణా స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంటు నిర్మాణాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. గత పాలకుల వైఫల్యాల వల్ల…
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎండవేడిమి, తీవ్ర వడగాల్పుల మధ్య జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో.. వాతావరణ శాఖ ఒక ఉపశమనం వార్త చెప్పింది. IMD ప్రకారం.. దేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణ మార్పులు మారబోతున్నాయి. ఏప్రిల్ 26 నుంచి 28 వరకు వాయువ్య భారతదేశంలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు.. ఈశాన్య భారతదేశంలో కూడా ఎండల బారీ నుండి ప్రజలు కూడా ఉపశమనం పొందనున్నారు. ఏప్రిల్ 27,…
టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఆటగాళ్లు ఎవరు ఆడితే బాగుందనే అంచనా వేస్తున్నారు టీమిండియా మాజీ ఆటగాళ్లు. ఇప్పటికే పలువురు మాజీ ప్లేయర్లు తమ అంచనాను తెలియజేశారు. తాజాగా.. హర్భజన్ సింగ్ కూడా తన అంచనా తెలియపరిచాడు. టీ20 వరల్డ్ కప్ కోసం ఆడే తన 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆయన సెలక్ట్ చేశాడు. ఆయన జాబితాలో సీనియర్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, శుబ్‌మన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం ఇవ్వలేదు.…
Azerbaijan: ఇకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న ఆర్మేనియా, అజర్బైజాన్ చిరకాల ప్రత్యర్థులుగా మారాయి. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితి ఇప్పటికీ ఉద్రిక్తంగానే ఉంది. నగోర్నో-కరబాఖ్ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం గడచిన మూడు దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య చెదురుమదురు సంఘర్షణలు జరుగుతూనే వచ్చాయి.