600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే..
చంద్రబాబు 160 సీట్లు వస్తాయని పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. గెలిచే అవకాశం లేదని టీడీపీ నాయకులకు కూడా తెలుసన్నారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని ఆయన విమర్శలు గుప్పించారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన.. చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు.
గతంలో కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి, అందులో 99 శాతం హామీలు అమలు చేశామని.. గతంలో ఉన్న 7 మెడికల్ కాలేజీలకు అదనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఈర లక్కప్పను, ఎంపీగా శాంతమ్మను గెలిపించాలని కోరుతున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా లంచానికి తావు లేకుండా సీఎం జగన్ పథకాలు అందిస్తున్నారన్నారు.
ఇంటింటికీ ఫించన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశం
ఏపీలో ఎన్నికల వేళ మరో కీలక అంశంపై చర్చ జరుగుతోంది. ఫించన్ల పంపిణీ దగ్గర పడుతుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఎన్నికలకు ముందు వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు ఫించన్లు అందజేసేవారు. కాని ఇటీవల ఎన్నికల సంఘం వాలంటీర్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. గత నెలలో కూడా ఫించన్ల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనలేదు. ఫించన్ల పంపిణీకి సమయం దగ్గర పడుతుండటంతో తాజాగా ఈసీ(EC) ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కుదరదని సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ(DBT) రూపంలో నేరుగా పింఛనుదారులకు చెల్లించాలని తెలిపింది. అయితే ఇంటింటి పెన్షన్ల పంపిణీకి సరిపడా సిబ్బంది లేరని సీఎస్ తెలిపారు. ఏప్రిల్‌లో చేపట్టినట్లు చేస్తామని వెల్లడించారు. పింఛన్లు సహా నగదు బదిలీ పథకాలకు సంబంధించి మార్చి 30న జారీ చేసిన మార్గదర్శకాలను ఈసీ గుర్తు చేసింది.
ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 148 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 51 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 111 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు నీళ్ల లో పోసింది సరిపోలేదా…
మాట మాట్లాడితే హరీష్ రావు దిగిపో అంటున్నారు.. రాజీనామాలు అంటున్నారని మంత్రి సీతక్క హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె కొమురం భీం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు పదవి కాంక్ష ఏంటో తెలిసిందని, 2018 ఎన్నికల్లో కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారన్నారు. చాలామందికి నువ్వు డబ్బులు ఇచ్చావని నీకు పదవి ఇవ్వకుండా ఆపారని, అప్పుడు ఎక్ నాథ్ షిండే లాగా నువ్వు వ్యవహరించవని నీకు పదవి ఇవ్వకుండా ఆపారంట.. ఇవి అప్పట్లో వార్తలు కూడా వచ్చాయని ఆమె అన్నారు. అధికారం పోయిందని అసహనం విమర్శలు చేస్తున్నారని, కాళేశ్వరం కట్టి లక్ష కోట్లు నీళ్ల లో పోసింది సరిపోలేదాన్నారు మంత్రి సీతక్క.
ఆత్మకూరు బహిరంగ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఆత్మకూరు బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఎవరూ ఆనందంగా లేరని.. కేవలం మాత్రమే జగన్, విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి బాగుపడ్డారన్నారు. టీడీపీ మేనిఫెస్టో సూపర్ హిట్ అన్నారు. తన దగ్గర డబ్బుల్లేవు ఏమీ చేయలేనని జగన్ చెప్పారని విమర్శించారు. నాయకుడికి విజన్ ఉండాలి.. పరిపాలన దక్షత ఉండాలన్నారు. అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. జగన్ ఎక్కడ చదువుకున్నాడో తెలియదని.. నేరాలు.. ఘోరాలు చేయడంలో పి.హెచ్.డి.చేశారని విమర్శించారు. పట్టాదారు పాస్ పుస్తకం పై జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. ఆస్తి అనేది ఒక హక్కు భద్రతని.. అలాంటి భూ రికార్డులను జగన్ మారుస్తున్నరని చెప్పారు. వేమిరెడ్డికి పోటీ ఎవరో తెలుసా.. ప్రాంతంలో ఆ వ్యక్తిని ఎప్పుడైనా చూశారా.. అని ప్రజలను అడిగారు. నిస్వార్థ సేవ కోసం ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయనకు మద్దతు ఇవ్వమని కోరారు.
మోడీని మామయ్య అంటూ పిలిచిన ప్రియాంక గాంధీ
గుజరాత్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని, స్వయంగా బీజేపీ నేతలే మీడియా చెప్తున్నారని గుర్తు చేశారు. గుజరాత్‌లోని వల్సాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్‌కు మద్దతుగా ఇవాళ ( శనివారం ) ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు.
పిఠాపురంలో బాబాయికి అండగా అబ్బాయి ప్రచారం..
ఏపీలో ఎన్నికల వేడి బాగా కొనసాగుతుంది. అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ తరపున ఇప్పటికే పలువురు సినీ నటులు ప్రచారం చేసారు. అందులో హైపర్ ఆది, గెటప్ శీను, డ్యాన్స్ మాస్టర్ తదితరులు కూడా పవన్ తరపున ప్రచారం చేసారు.
నేతన్నలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు
నేతన్నలు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు,ఎలాంటి కష్టం వచ్చినా ప్రభుత్వాన్ని సంప్రదించండని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇవాళ ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాట్లాడుతూ.. ప్రభుత్వం జి.ఓ.నెం.1 లో నేతన్నలకు పాలసి తీసుకువస్తోందని, గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల కన్నా అధిక ఆర్డర్లు ఇచ్చి అధిక సంపాదన వచ్చేటట్లు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెక్స్టైల్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతన్నల ఉపాధి కొరకు సానుకూలంగా ఉన్నారని, గత ప్రభుత్వం చేసిన అప్పులను చక్క దిద్దే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. శవ రాజకీయాలను మానుకొని నేతన్నల అభ్యున్నతికి తోడ్పాటుకు ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసేలా మేనిఫెస్టో
జగనన్న అందిస్తున్న నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసే విధంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు పశ్చిమగోదావరిజిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు సైతం ముక్కు మీద వేలేసుకునేలా ఈ మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని తెలిపారు. దేశంలోనే ఏ జాతీయ పార్టీ కూడా ఈ స్థాయిలో మేనిఫెస్టో పెట్టలేదని.. మన పార్టీ గతంలో విడుదలన చేసిన మేనిఫెస్టో వందకి 99% పూర్తి చేసామన్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా 100కు 100% పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ మేనిఫెస్టోలాగా వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో తొలగించే పరిస్థితి మాది కాదని తెలిపారు. మాటిచ్చామంటే చేస్తామని చెప్పారు. గతంలో మన మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేశామని చెప్పారు.
రేవంత్ రెడ్డి మతిస్థిమితం కోల్పోయాడా…. గజినిగా మారాడా
రేవంత్ రెడ్డి మతిస్థిమితం కొల్పోయాడా…. గజినిగా మారాడా అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త అంశాలను తెరమీదకు తీసుకు వస్తున్నారని, కాళేశ్వరం పోయింది పోన్ ట్యాపింగ్ వచ్చింది… పోన్ ట్యాపింగ్ పోయి మరో అంశం తెరపైకి తెచ్చారన్నారు మహేశ్వర్ రెడ్డి. రెఫరెండం అన్నావు 14 సీట్లు గెలుస్తామని అన్నావు… 14 గెలిస్తే నేను రాజీనామా చేస్తా అన్న మీరు స్పందించలేదని, రేవంత్ రెడ్డి, హరీష్ రావు లు కలిసి డ్రామా ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు. హరీష్ రేవంత్ ల చీకటి ఒప్పందం లో భాగంగానే ఈ రాజీనామా లా నాటకమని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేలకు హరీష్ రావు నాయకత్వం వహిస్తారని అనుమానం వస్తుందని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు.