బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను కె.పి.హెచ్.బి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూకట్పల్లి ఏసిపి వివరాలు వెల్లడించారు. భువనగిరి జిల్లా నాగయ్యపల్లి తండాకు చెందిన బానోతు భాస్కర్(21) బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ రమ్మీ, మద్యానికి బానిసై డబ్బుల సంపాదన కోసం చోరీల బాట పట్టాడు. బంగారం దుకాణంలోకి కస్టమర్ లాగా ప్రవేశించి పలు చైన్లను…
మహేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్టపడని అభిమానులు ఎవరూ ఉండరు. ఆయనకు దేశ వ్యాప్తంగా కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.. ఫుల్ క్రేజ్ కూడా ఉంది. తాజాగా.. ధోనీ ఐపీఎల్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆయనకిదే చివరి సీజన్ అని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో.. అభిమానులు తలాను చూసేందుకు స్టేడియానికి పోటెత్తుతున్నారు. చిన్న చితకా అని తేడా లేకుండా మహీ కోసం బారులు తీరున్నారు. ఇదిలా ఉంటే.. ధోనీకి అమ్మాయిలు, అబ్బాయిలతో పాటు…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ల విధానాలకు సంబంధించి గత కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోడీ తప్పుడు ఆరోపణలు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. రిజర్వేషన్ల వ్యవస్థపై మోడీకి అవగాహన లేక కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం వర్గాలకు 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 4% రిజర్వేషన్లు అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు.…
కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా కుటుంబం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 15 ఏళ్ల తర్వాత కమలాపురం కోటపై టీడీపీ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలువగా.. 2014, 2019లో జగన్ మేనమామ పి. రవీంధ్రనాథ్ రెడ్డి వరుసగా 2 సార్లు గెలిచారు. మరోవైపు వరుసగా ఓడిపోయినా ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉంటూ... ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్నామని పుత్తా ఫ్యామిలీ చెబుతోంది.…
మోడీ, రాహుల్‌లకు ఎన్నికల సంఘం నోటీసులు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఈసీ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం లేదా భాష ప్రాతిపదికన ఆయన విద్వేషం, విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి. కమిషన్ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు సమాధానం కోరింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ…
కారులో ఆడుకుంటుండగా డోర్స్ లాక్స్ అయి.. ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన సెంట్రల్ ముంబైలో చోటు చేసుకుంది. అనోట్ప్ హిల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో చాలా గంటల పాటు పిల్లలు ఉండటంతో ఊపిరాడక పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులు ముస్కాన్ మొహబ్బత్ షేక్ (5), సాజిద్ మహ్మద్ షేక్ (7)గా గుర్తించారు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రెండు మూడు రోజులుగా మాజీ ప్రధాని పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నరేంద్రమోడీ వ్యాఖ్యలు సరికాదు. నరేంద్రమోడీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె…
గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో తమ పేర్లను స్థానిక ఆలయ పండుగ కరపత్రంలో ప్రచురించకపోవడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని వస్త్రాపూర్ ప్రాంతంలో బుధవారం రాత్రి ఒక వర్గం మరో వర్గంపై కర్రలు, రాళ్లతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
భూమ్మీద నూకలు ఉన్నట్లు ఉంది.. అందుకే బతికి బయటపడ్డాడు. చిరుత దాడి చేసినా తీవ్ర గాయాలైనప్పటికీ సేఫ్ గానే ఉన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విటల్.. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటన హరారే సమీపంలోని బఫెలో రేంజ్ లో జరిగింది. ఈ విషయాన్ని తన భార్య హన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తీవ్ర గాయాలైన విటలో ఫోటోను ఆమె పోస్ట్ చేసింది.
హైదరాబాద్ వాసులు మే 9వ తేదీన తమ నీడలు కనుమరుగయ్యే అసాధారణ సంఘటనను అనుభవించనున్నారు! ‘జీరో షాడో డే’గా పిలువబడే ఈ విశిష్ట దృగ్విషయం మధ్యాహ్నం 12:12 నుండి 12:19 గంటల మధ్య జరుగుతుంది. ఈ సమయంలో, సూర్యుడు నేరుగా మధ్యాహ్న సమయంలో తలపైకి ఉంటుంది, దీని వలన నిలువు వస్తువుల నీడలు కనిపించవు. నీ నీడలా వెంటాడుతా.. అంటుంటారు. ఎప్పుడూ మన వెంటే ఉండే నీడలా నన్ను ఫాలో అవుతాను అనే ఉద్దేశంలో మాట్లాడుతుంటారు. సాధారణంగా…