Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, ప్రయాణాలను సురక్షితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ట్రాఫిక్, రోడ్డు, రైలు భద్రతను పటిష్టం చేయడానికి “తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో” (TG-TMARS) ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పోలీస్ శాఖలో ప్రత్యేక బ్యూరోగా రూపుదిద్దుకున్న ఈ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రవ్యాప్తంగా తన అధికార పరిధిని కలిగి ఉంటుంది. అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారి దీనికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం తెలంగాణలో 32 వేల కిలోమీటర్లకు పైగా రోడ్ల నెట్వర్క్ ఉండగా.. వాహనాల సంఖ్య 1.8 కోట్లకు పైగా చేరింది. ఈ నేపథ్యంలో శాస్త్రీయ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ నిర్వహణే లక్ష్యంగా ఈ బ్యూరో పనిచేయనుంది. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్‌లో ట్రాఫిక్ నిర్వహణ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో పాటు, రాష్ట్రంలో రైలు ప్రయాణ భద్రతపైనా ఈ బ్యూరో నిఘా ఉంచనుంది. మోటార్ వెహికల్స్ యాక్ట్-1988లోని సెక్షన్ 200 ప్రకారం ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ విధులను TG-TMARS పర్యవేక్షిస్తుంది.
Also Read
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
- LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
ఈ బ్యూరో పరిధిలోకి హైవే పెట్రోలింగ్, రోడ్డు ప్రమాదాల దర్యాప్తు వంటి కీలక అంశాలు వస్తాయి. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో ఆధునిక అనలిటిక్స్, ప్రాసిక్యూషన్‌కు ప్రత్యేక వ్యవస్థను ఇది రూపకల్పన చేస్తుంది. రోడ్డు భద్రతకు సంబంధించి ఎలక్ట్రానిక్ మానిటరింగ్, ఎన్ఫోర్స్మెంట్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర రహదారి రవాణా శాఖ జారీ చేసిన ఎలక్ట్రానిక్ మానిటరింగ్, రోడ్ సేఫ్టీ ఎస్ఓపీ (SOP)లను కచ్చితంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల్లోని ట్రాఫిక్ విభాగాలన్నింటిపై TG-TMARS పర్యవేక్షణ ఉంటుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన పనిచేసే రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి పర్యవేక్షణలో ఈ బ్యూరో తన విధులను నిర్వర్తిస్తుంది. రాష్ట్ర రోడ్డు భద్రతా మండలిలో TG-TMARS డైరెక్టర్ సభ్యుడిగా వ్యవహరిస్తారు. మండలి తీసుకునే ప్రతిష్టాత్మక నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత ఈ బ్యూరోపై ఉంటుంది. ఈ ప్రత్యేక వ్యవస్థ ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రయాణికులకు మెరుగైన భద్రతను అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
-
Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
-
LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ఆగిపోతుందా? అక్టోబర్ 1 నుంచి మారనున్న నిబంధనలు..
-
Off The Record: వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం వారసుడా? అసలు కథ ఏంటి?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!