Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్‌కు తొలి సెక్రటరీ జనరల్‌గా నౌమాన్ మహమూద్
- రియాద్‌లో ఏర్పాటు కానున్న కూటమి సెక్రటేరియట్‌కు ఆయన నేతృత్వం
- 1971 భారత యుద్ధంలో నౌమాన్ తండ్రి రాజా సుల్తాన్ మహమూద్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Makkah Defence Pact: పాకిస్తాన్-సౌదీ అరేబియా-టర్కీలు కలిసి ‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’పై సంతకం చేశాయి. ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఒక దేశంపై దాడి జరిగితే అది మూడు దేశాలపై దాడిగా పరిగణిస్తూ, రక్షణగా నిలుస్తామని మక్కా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మక్కా కూటమికి సెక్రటరీ జనరల్‌గా పాకిస్తాన్ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) నౌమాన్ మహమూద్ నియమితులయ్యారు.
భారత్‌తో యుద్ధంలో తండ్రి మరణం:
నౌమాన్ మహమూద్ తండ్రి రజా సుల్తాన్ మహమూద్ 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ 32 బలూచ్ రెజిమెంట్‌లో కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. పాకిస్తాన్ సైనిక చరిత్ర ప్రకారం.. తూర్పు పాకిస్తాన్‌లోని పిర్గంజ్ ప్రాంతంలో జరిగిన పోరులో ఆయన మరణించారు. భారత్ సైన్యం వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న స్థావరాన్ని భారత గూర్ఖా రైఫిల్స్ చేజిక్కించుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో రజా సుల్తాన్ మహమూద్ హతమయ్యారు.
Also Read
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
- Iran-UAE: ఇరాన్ విమానాలకు యూఏఈ షాక్.. అన్ని విమానాలు నిలిపివేత.. కారణమిదే!
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
పాక్ సైన్యంలో అనేక పదవుల్లో పనిచేసిన నౌమాన్..
నౌమాన్ మహమూద్ 1987లో పాకిస్తాన్ సైన్యంలో చేరారు. పదాతిదళంలో పనిచేసి, కమాండర్ బాధ్యతలు నిర్వహించారు. పాకిస్తాన్ నేషనల్ డిఫెన్స్ యూనివర్సిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2023లో సైన్యం నుంచి పదవీవిరమణ పొందారు. హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై భీకరదాడులు చేస్తున్న సమయంలో నౌమాన్ నియామకం జరిగింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!