Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ పోటీలు..
- నేటి నుంచి మొదలు..
- భారత జట్టు నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత
- భారత్ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 28న..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో పురుషుల క్రికెట్ పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో భారత పురుషుల జట్టు కూడా బరిలోకి దిగుతోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించింది. గత ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత్.. ఈసారి కూడా టైటిల్‌ను నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టింది.
భారత పురుషుల క్రికెట్ జట్టు ఏషియన్ గేమ్స్ 2026లో తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 28న ఆడనుంది. నిషిన్‌లోని కొరోగి అథ్లెటిక్ పార్క్‌లో ఉదయం 10:00 గంటలకు క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్ ప్రారంభమవుతుంది. గ్రూప్-Aలో రెండో స్థానంలో నిలిచే జట్టు భారత్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది. గ్రూప్-Aలో ఆఫ్ఘనిస్థాన్, జపాన్, నేపాల్ జట్లు ఉన్నాయి.
Also Read
- Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
పురుషుల క్రికెట్లో మొత్తం 2 గ్రూపులు ఉన్నాయి. గ్రూప్-Aలో ఆఫ్ఘనిస్థాన్, జపాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్-Bలో హాంకాంగ్, మలేషియా, ఒమన్ ఉన్నాయి. ఈ రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచే జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరతాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు నేరుగా క్వార్టర్‌ఫైనల్ బెర్తులు లభించాయి.
పాకిస్థాన్ కూడా సెప్టెంబర్ 28న క్వార్టర్‌ఫైనల్ ఆడనుంది. అయితే భారత్, పాకిస్థాన్ జట్లు క్వార్టర్ఫైనల్లో తలపడే అవకాశం లేదు. భారత్ రెండో క్వార్టర్ఫైనల్లో గ్రూప్-Aలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో ఆడుతుంది. పాకిస్థాన్ తొలి క్వార్టర్ఫైనల్లో గ్రూప్-Bలో రెండో స్థానంలో నిలిచే జట్టును ఎదుర్కొంటుంది. రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరితేనే తర్వాతి దశలో భారత్-పాక్ మ్యాచ్‌కు అవకాశం ఉంటుంది.
ఇక ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే స్వర్ణ పతకాన్ని సాధించింది. సెప్టెంబర్ 22న జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత్.. శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి వరుసగా రెండోసారి ఏషియన్ గేమ్స్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు పురుషుల జట్టు కూడా అదే తీరును పునరావృతం చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు.
భారత పురుషుల జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉండగా.. జట్టులో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ లు ఉన్నారు.
పురుషుల క్రికెట్ పూర్తి షెడ్యూల్..
* సెప్టెంబర్ 24: ఆఫ్ఘనిస్థాన్ vs జపాన్ – ఉదయం 5:30 గంటలకు
* సెప్టెంబర్ 24: హాంకాంగ్ vs మలేషియా – ఉదయం 10:30 గంటలకు
* సెప్టెంబర్ 25: హాంకాంగ్ vs ఒమన్ – ఉదయం 5:30 గంటలకు
* సెప్టెంబర్ 25: ఆఫ్ఘనిస్థాన్ vs నేపాల్ – ఉదయం 10:30 గంటలకు
* సెప్టెంబర్ 26: జపాన్ vs నేపాల్ – ఉదయం 5:30 గంటలకు
* సెప్టెంబర్ 26: మలేషియా vs ఒమన్ – ఉదయం 10:30 గంటలకు
* సెప్టెంబర్ 28: పాకిస్థాన్ vs గ్రూప్-B రెండో స్థానం – ఉదయం 5:30 గంటలకు
* సెప్టెంబర్ 28: భారత్ vs గ్రూప్-A రెండో స్థానం – ఉదయం 10:30 గంటలకు
* సెప్టెంబర్ 29: శ్రీలంక vs గ్రూప్-A విజేత – ఉదయం 5:30 గంటలకు
* సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ vs గ్రూప్-B విజేత – ఉదయం 10:30 గంటలకు
* అక్టోబర్ 1: తొలి సెమీఫైనల్ – ఉదయం 5:30 గంటలకు
* అక్టోబర్ 1: రెండో సెమీఫైనల్ – ఉదయం 10:30 గంటలకు
* అక్టోబర్ 3: కాంస్య పతక పోరు – ఉదయం 5:30 గంటలకు
* అక్టోబర్ 3: ఫైనల్ – ఉదయం 10:30 గంటలకు
అన్ని మ్యాచ్‌లు నిషిన్‌లోని కొరోగి అథ్లెటిక్ పార్క్‌లోనే జరగనున్నాయి.
తాజావార్తలు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!