బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో ప్రీమియర్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడం, రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం వస్తుందటంతో ‘ది ప్యారడైజ్’పై జనాల్లో హైప్ ఆకాశాన్ని తాకింది. రెగ్యులర్ రిలీజ్ కంటే ముందే సెప్టెంబర్ 23 రాత్రి దేశవ్యాప్తంగా ప్రదర్శించిన ది ప్యారడైజ్ స్పెషల్ ప్రీమియర్ షోలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా కేవలం ప్రీమియర్స్‌తోనే ఏకంగా రూ. 12.8 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. నాని కెరీర్లోనే ఇది ఆల్-టైమ్ రికార్డ్ ఓపెనింగ్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు కనీవినీ ఎరుగని స్థాయిలో థియేటర్లలో రికార్డు ఆక్యుపెన్సీ నమోదైంది.
శ్రీకాంత్ ఓదెల విజువల్ మేకింగ్, నాని నెవర్ బిఫోర్ మాస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ఉన్న భారీ అంచనాలకు ప్రీమియం టికెట్ రేట్లు కూడా తోడవడంతో వసూళ్ల జాతర సాగింది. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లోని ప్రీమియర్ షోలన్నీ గంటల వ్యవధిలోనే హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టేశాయి. ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్గా కయాదు లోహర్ తన అందం, అభినయంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన బలంగా మారగా.. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సోనాలి కుల్కర్ణి, సంపూర్ణేష్ బాబు తమ పాత్రల్లో అద్భుతంగా మెప్పించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఒక్క రాత్రి ప్రీమియర్స్‌తోనే దాదాపు రూ.13 కోట్లకు చేరువగా గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించిన ‘ది ప్యారడైజ్’, ఫస్ట్ డే ముగిసేసరికి ఇంకెన్ని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి మరి.
Also Read
- Vijay Deverakonda: 'కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం'
- Mythri Ravi: 'తారక్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం'
- Nagarjuna: 'పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే'
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
తాజావార్తలు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!