Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 03 05 2024

Top Headlines @9PM : టాప్ న్యూస్

Published Date :May 3, 2024 , 9:09 pm
By Gogikar Sai Krishna
Top Headlines @9PM : టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏపీలో ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచుతున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఉన్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రెండవ దశ ప్రచార పర్యటనలో భాగంగా ఈనెల 6న రాజమండ్రి, అనకాపల్లి లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నారు.

పెన్షన్ల విషయంలో రాజకీయం జరుగుతోంది..

ఎండలను సైతం లెక్కచేయకుండా ఆప్యాయత, అనురాగాలు చూపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. పదిరోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని.. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు అని సీఎం పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. జగన్‌కు ఓటేస్తే పథకాల కొనసాగింపు.. చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు అని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు ఓటేస్తే సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని.. ఆయనకు ఓటేస్తే వదల బొమ్మాళీ అంటూ పశుపతిలా బయటకు వస్తాడని విమర్శలు గుప్పించారు. పెన్షన్ల మీదే చంద్రబాబు బృందం గురిపెట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు మీరు ఇచ్చిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు.. ఇప్పుడు పెన్షన్ మూడు వేలు చేసి ఇంటికి పంపుతుంది ఎవరు అని అడుగుతున్నామని జగన్ ప్రశ్నించారు.

కష్ట కాలంలో గులాబీ జెండాను గద్దేనెక్కించింది ఘనపూర్ గడ్డా

సన్నాహాక సమావేశంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్ట కాలంలో గులాబీ జెండా ను గద్దేనెక్కించింది ఘనపూర్ గడ్డా అని ఆయన అన్నారు. మోసగాళ్ళకే మోసగాడు కడియం శ్రీహరి అని ఆయన విమర్శించారు. తొక్కల మినిస్టర్ నాలుగు సార్లు చేసి డిగ్రీ కళాశాల తేలేదని, ఘనపూర్ కు ఎక్కువ నష్టం చేసిన కడియం ను రాజకీయ సమాధి చేయాలన్నారు పల్లా. మున్సిపాలిటీ,టెక్స్టైల్ పార్కు, సైనిక్ స్కూల్ రాకుండా అడ్డుపడ్డాడని, బిచ్చగాడిలా డబ్బులు తీసుకున్నావని ఆయన విమర్శించారు. నీతి, నిజాయితీ అని చెప్పడం కాదు.. రాజీనామా చేసి రా.. అని ఆయన సవాల్‌ విసిరారు. నీ వల్ల లాభం పొందినవారు తెలంగాణ లో ఎవ్వరూ లేరని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి కనీసం సొంత ఇల్లు కూడా లేదన్నారు. డాక్టర్ సుధీర్ కుమార్ ను గెలిపించాలని ఆయన కోరారు. నీతిమంతునికి , అవినీతి మంతునికి మధ్య జరిగే ఎన్నికలు అని ఆయన అన్నారు. కడియం తో పొల్చకండని ఊసరవెల్లి కూడా మొత్తుకుంటుందట అని ఆయన మండిపడ్డారు.

ప్రజలు నవ్వుకుంటారు.. అసహ్యించుకుంటారు అనే సిగ్గు లేదు

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు మళ్ళీ అసంబద్ధ హామీలు అని ఆయన విమర్శించారు. సర్పంచ్‌లకు నేరుగా నిధులు ఆల్రెడీ వస్తున్నాయని, పీఎం సూర్య ఘర్ సోలార్ విద్యుత్ యోజన.. ఇప్పటికే కేంద్రం ప్రారంభించిందన్నారు కిషన్‌ రెడ్డి. సంగీత నాటక అకాడమీ కి ఫౌండేషన్ , ఘంటశాల కళమండపం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇచ్చింది.. శంఖుస్థాపన కూడా అయిందని, రైల్వే మానుఫాక్చరింగ్ యూనిట్ పనులు ఇప్పటికే జరుగుతున్నాయన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టర్ ఫీజిబిలిటీ కాదని రిపోర్ట్ లు వచ్చాయి… ఇది ప్రజలకి, రామగుండం మణుగూరు రైల్వే సంబందించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రేవంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ వేస్తున్న అని, 2017 లోనే సైనిక స్కూల్ మంజూరు అయి ఉంది … కేసీఆర్‌ సర్కార్ సహకరించలేదన్నారు కిషన్‌ రెడ్డి.

విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్కి రండి.. బాలకృష్ణకు మంత్రి సవాల్

టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. బాలకృష్ణ చీపురుపల్లి, విజయనగరంలో పర్యటనలో మాట్లాడే తీరు చూశానని.. పేపర్లు ఇటుతిప్పి అటుతిప్పి మాట్లాడారని ఎద్దేవా చేశారు. అసలు భౌగోళిక పరిస్థితులపై అసలు అవగాహన ఉందా అని విమర్శించారు. బాలకృష్ణ విద్యాశాఖపై మాట్లాడారు.. డిబెట్ కి రండి అని మంత్రి బొత్స సవాల్ విసిరారు. కళ్లులేని కబోదికి ఏం తెలుస్తుంది ఆ విధంగా ఉంది ప్రసంగమని అన్నారు. మూడో తరగతి నుంచే టోఫెల్ పరీక్షలకు తరఫీదు ఇస్తున్నాం.. మండలానికి పది ప్లస్ అప్ గ్రేడ్ చేశాం.. ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇప్పించి.. డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామని తెలిపారు. ఎనిమిది తొమ్మిది తరగతులకు బైజూస్ ఇచ్చిన పాఠ్యాంశాలు ఇస్తున్నామన్నారు.

ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ నాకు రెండు కళ్లు.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తనకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ ఉందని.. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామన్నారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఎమ్మెల్యే నానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మద్దతు తెలియజేశారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఎన్టీఆర్ అభిమానులనుద్దేశించి ఎమ్మెల్యే కొడాలి నాని ప్రసంగించారు.

కూటమి అధికారంలోకి రాగానే ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

వైసీపీని అందలం ఎక్కిస్తే మన భవిష్యత్తును చంపేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. తనకు గిద్దలూరులో ఉన్న బలం ఉందన్నారు. తెలుగుదేశం అభ్యర్థికి మద్ధతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ రాష్ర్ట భవిష్యత్ కోసం త్యాగం చేశానని.. కూటమి ప్రభుత్వం రాగానే తెలుగు గంగ, గుండ్లమోటు ప్రాజెక్టులను ఏకం చేస్తామన్నారు. గిద్దలూరులో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ వెలుగొండ ప్రాజెక్టు పూర్తికాకపోయినా సొరంగాలు తవ్వి ప్రాజెక్ట్ ప్రారంభించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతాంగానికి సాగు, తాగు నీళ్ళు అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీకృష్ణ దేవరాయులు తవ్విన కంభం చెరువుని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.

రాయ్‌బరేలీ “కర్మభూమి”.. నా తల్లి బాధ్యతల్ని అప్పగించింది..

కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. కొన్ని పర్యాయాలుగా సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానం నుంచి ఆయన బరిలోకి దిగారు. నామినేషన్ తర్వాత ఆయన భావోద్వేగంతో ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన తల్లి 20 ఏళ్లుగా కొనసాగిన ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్‌‌బరేలీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడం తనకు ఉద్వేగభరితమైందని ఆయన శుక్రవారం అన్నారు. తన కుటుంబానికి ‘కర్మభూమి’గా రాయ్‌బరేలీని అభివర్ణించారు. తన తల్లి ఈ బాధ్యతల్ని అప్పగించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిందని చెప్పారు.

ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు

రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవని, పీక్ డిమాండ్ లో కూడా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుండగా బిఆర్ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపు కోవడానికి అసత్య ప్రచారం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు తప్పుపట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతదని అసెంబ్లీ ఎన్నికల ముందు బి ఆర్ ఎస్ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు మాత్రం ఇంకా బుద్ధి రాలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసం బిఆర్ఎస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ల మీటింగ్లు, ప్రెస్మీట్లలో కరెంట్ కట్ అయినట్లు.. వాళ్లకు వాళ్లే నాటకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. సూర్యాపేటలో, మొన్న మహబూబ్నగర్ కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు పోయిందని సోషల్ మీడియాలో లేని పోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వెల్లడించారు.

పింఛన్ల పంపిణీపై సీఎస్ తీరు సరికాదు

గిద్దలూరు చెత్త మార్కాపురంలో బంగారం అవుతుందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా పొదిలి బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. శేషాచలం స్మగ్లర్ చెవిరెడ్డి కావాలా… ప్రజానాయకుడు మాగుంట కావాలో తెలుసుకోవాలని ఓటర్లకు సూచించారు. పింఛన్లు మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. పింఛను 200 నుంచి 2000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్నారు. పింఛన్ల పంపిణీ విషయంలో సీఎస్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదన్నారు. సింపతి కోసం జగన్ ప్రాథేయ పడుతున్నారన్నారు.

తెలంగాణ టెట్ పరీక్షలలో స్వల్ప మార్పులు.. షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ..

తెలంగాణ టెట్ (TS TET) పరీక్షల రీషెడ్యూల్ వచ్చేసింది. ఇదివరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. మే 20న పరీక్షలు మొదలవుతాయి. అయితే, ఈ పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగుస్తాయి. ఏప్రిల్ 27న పరీక్ష ఉండదు. అదే రోజు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఈ నిరన్యం తీసుకుంది విద్యాశాఖ. విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం., పరీక్షలు మే 20 న ప్రారంభమవుతాయి. ఈ పరీక్షలు జూన్ 06 న ముగుస్తాయి. కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, అన్ని పరీక్షలు జూన్ 2వ తేదీతో ముగుస్తాయి. ఏప్రిల్ 27న మాత్రమే పరీక్ష ఉండదు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • chandrababu
  • cm jagan
  • CM Revanth Reddy
  • telugu news

తాజావార్తలు

  • Janhvi Kapoor:మద్యం నా జీవితంలో ఒక విలన్.. ఆ వాసన అంటేనే అసహ్యం వేసింది! జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు!

  • AP Singh: అమెరికా యుద్ధ విమానంలో భారత్ ఎయిర్ చీఫ్ ఏపీ సింగ్ పర్యటన.. ఫొటోలు వైరల్

  • Hit and Run Case : జూబ్లీహిల్స్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కీలక మలుపు

  • SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?

  • Prakash Raj Controversy: శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రకాష్‌రాజ్‌కు వీహెచ్‌పీ సీరియస్‌ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions