144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
- చైనాలో Xiaomi Pad 9, Xiaomi Pad 9 Pro ట్యాబ్లెట్లను లాంచ్
- రెండు ట్యాబ్లెట్లలోనూ యాంటీ-గ్లేర్ సాఫ్ట్ లైట్ ఎడిషన్ వేరియంట్స్..
- Xiaomi Pad 9 Proలో 12.5 అంగుళాల 144Hz డిస్ప్లే
- 11,000mAh భారీ బ్యాటరీతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi Pad 9, Pad 9 Pro: షియోమీ తన కొత్త ట్యాబ్లెట్ సిరీస్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. Xiaomi Pad 9, Xiaomi Pad 9 Pro పేర్లతో వచ్చిన ఈ ట్యాబ్లెట్లలో అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లేలు, శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్లు, భారీ బ్యాటరీలు ఉన్నాయి. వీటితో పాటు “యాంటీ-గ్లేర్ సాఫ్ట్ లైట్ ఎడిషన్” వేరియంట్లను కూడా కంపెనీ అందించింది.
Xiaomi Pad 9
Xiaomi Pad 9లో 11.2 అంగుళాల LCD డిస్ప్లేను అందించారు. ఇది 3200×2136 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 144Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 360Hz టచ్ శాంప్లింగ్, 240Hz స్టైలస్ సపోర్ట్, HDR10, డాల్బీ విజన్, DCI-P3 కలర్ గామట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. తడి చేతులతో కూడా స్క్రీన్‌ను ఉపయోగించుకునే సదుపాయం ఉంది. పనితీరు కోసం Snapdragon 8s Gen 4 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. 8GB లేదా 12GB RAMతో పాటు 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. 128GB వేరియంట్లో UFS 3.1, 256GB వేరియంట్లో UFS 4.1 స్టోరేజ్‌ను అందించారు.
Also Read
- 150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
- Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
- 100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
ఇక ఇందులో 9,720mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అలాగే ఫొటోలు, వీడియోల కోసం వెనుకవైపు 13MP కెమెరా, ముందు భాగంలో 8MP కెమెరా ఉన్నాయి. వీడియో రికార్డింగ్‌తో పాటు వివిధ ఫొటో, వీడియో మోడ్‌లను అందించారు. నాలుగు స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లు, డాల్బీ అత్మోస్, Hi-Res ఆడియో కూడా ఉన్నాయి.
Xiaomi Pad 9 8GB+128GB వేరియంట్ ధర 2,999 యువాన్లు. 8GB+256GB ధర 3,299 యువాన్లుగా నిర్ణయించగా.. సాఫ్ట్ లైట్ ఎడిషన్ ధర 3,499 యువాన్లు, 12GB+256GB వేరియంట్ ధర 3,799 యువాన్లు. ఈ ట్యాబ్లెట్ ప్రస్తుతం చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.
Xiaomi Pad 9 Pro
ఈ సిరీస్‌లో మరింత శక్తివంతమైన మోడల్‌గా Xiaomi Pad 9 Proను కంపెనీ లాంచ్ చేసింది. పెద్ద డిస్ప్లేతో పాటు కొత్త తరం స్నాప్ డ్రాగన్ చిప్సెట్, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ, మెరుగైన కెమెరాలను ఇందులో అందించారు. ఇక ఇందులో12.5 అంగుళాల డిస్ప్లే ఉంది. 3200×2136 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 360Hz టచ్ శాంప్లింగ్, 240Hz స్టైలస్ సపోర్ట్ ఉన్నాయి. HDR10, డాల్బీ విజన్, DCI-P3, TÜV లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డైరెక్ట్ లైటింగ్‌లో ప్రతిబింబాలను తగ్గించేందుకు “సాఫ్ట్ లైట్ ఎడిషన్”ను కూడా అందించారు.
పనితీరు కోసం 3nm ఆధారిత Snapdragon 8 Gen 5 మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇందులో Adreno 829 GPU ఉంది. 8GB, 12GB, 16GB RAMతో పాటు 128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో 11,000mAh భారీ బ్యాటరీను అందించారు. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14.5 గంటల వరకు నిరంతర షార్ట్ వీడియో ప్లేబ్యాక్ లేదా 20 గంటల వరకు ఆన్లైన్ మీటింగ్‌లను నిర్వహించవచ్చని కంపనీ పేర్కొంది.
Xiaomi Pad 9 Proలో 50MP రియర్ కెమెరాను అందించారు. ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. 4K, 1080p, 720p వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది. నాలుగు స్పీకర్లు, నాలుగు మైక్రోఫోన్లు, డాల్బీ అత్మోస్, Hi-Res ఆడియో, నాయిస్ రిడక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం Wi-Fi 7, Bluetooth 6.0, USB Type-C 3.2 Gen 1, Miracast, IPv6 వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్‌ప్రింట్, యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, యాంబియంట్ లైట్, హాల్, జియోమాగ్నెటిక్, IR సెన్సర్లు కూడా ఉన్నాయి.
చైనాలో Xiaomi Pad 9 Pro 8GB+128GB వేరియంట్ ధర 3,799 యువాన్లు కాగా.. 8GB+256GB ధర 4,099 యువాన్లు, 12GB+256GB ధర 4,599 యువాన్లు, సాఫ్ట్ లైట్ ఎడిషన్ ధరను 4,799 యువాన్లుగా నిర్ణయించారు. ఇక టాప్ ఎండ్ మోడల్ 16GB+256GB వేరియంట్ ధర 4,999 యువాన్లుగా ఉంది. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. గ్లోబల్ మార్కెట్లలో విడుదలపై కంపెనీ ఇంకా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు.
తాజావార్తలు
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!