టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. తన బర్త్ డేను ఆర్సీబీ ప్లేయర్లతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో విరాట్, అనుష్కతో పాటు ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ దంపతులు హాజరై సందడి చేశారు. కాగా.. ఈ నెల 1న అనుష్క పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫొటోలు బయటకొచ్చాయి. కుమారుడు అకాయ్‌కు జన్మనిచ్చిన తర్వాత అనుష్క ఫొటోకు…
రెండోసారి అధికారమే లక్ష్యంగా అధికార పార్టీ వైసీపీ దూకుడుగా వెళ్తోంది. వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జగ్గంపేట వైసీపీ అభ్యర్థి తోట నరసింహం గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా ప్రచారంలో నిర్వహిస్తున్నారు.
సీఎస్కేకు సూపర్ ఫ్యాన్ అయిన ఎస్.రాందాస్ (103) అనే వృద్ధుడికి మహేంద్ర సింగ్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేసిన జెర్సీపై తన సంతకం, ప్రత్యేక సందేశం రాసి రాందాస్ కొడుకు అందిచారు. ధోనీ పంపిన జెర్సీని చూసి తాత హర్షం వ్యక్తం చేశారు. గతంలోనూ చెన్నై జట్టుపై రాందాస్ తన అభిమానాన్ని సీఎస్కే తమ ట్విట్టర్ అకౌంట్ లో పంచుకుంది.
న్యూయార్క్‌లో హోటల్ ధరలు ఆకాశన్నంటాయి. కారణమేంటంటే.. టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే.. కాగా.. జూన్ 9వ తేదీన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ ఉంది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ను లైవ్ లో చూడాలనుకునే ఫ్యాన్స్ ఎక్కువగానే ఉంటారు. దాయాదుల మధ్య పోరు అంటే.. ఏ దేశంలో జరిగినా, డబ్బులు లెక్క చేయకుండా వెళ్తారు.
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ తుని అసెంబ్లీ నియోజకవర్గంపైనే ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక సెగ్మెంట్లో మరోసారి విజయకేతనం ఎగరవేయాలని అధికార వైసీపీ ఆశిస్తోంది. గెలుపు కోసం ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి దాడిశెట్టి రాజా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన తరఫున కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేపడుతున్నారు.
టీడీపీపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించి కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. ఉద్యోగస్తులకు, పెన్షన్లర్లకు ప్రభుత్వం చేసిన మంచి విషయాలను దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొంతమంది ఓట్ల కోసం మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవు పలికారు. కోవిడ్ వల్ల ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీల విషయంలో జాప్యం జరిగింది.. దీనిని భూతద్దంలో చూపుతున్నారని మండిపడ్డారు. పది వేలకు మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ప్రభుత్వం…
రాష్ట్ర భవిష్యత్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ఆలోచించి ఓటేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ఆయన ప్రసంగించారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబుకు తాను వీరాభిమానిని అని సన్ రైజర్స్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. 'మా నాన్న కృష్ణ అభిమాని. పోకిరి సినిమా నుంచి నేను మహేశ్‌ను ఫాలో అవుతున్నా. ఆయన చేసే సినిమాలు చాలా స్ఫూర్తినిస్తాయి' అని నితీశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఐపీఎల్లో హైదరాబాద్ తరుఫున నిలకడగా రాణిస్తు్న్న నితీశ్.. జట్టులో కీలక ప్లేయర్‌గా మారి ప్రశంసలు పొందుతున్నాడు.
సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాకపోతే రేవంత్…