Supreme Court: కర్ణాటకకు బిగ్ షాక్.. తమిళనాడుకు కావేరీ జలాలు విడుదలకు ఆదేశం
- కర్ణాటకకు బిగ్ షాక్
- కావేరీ జలాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- మిళనాడుకు కావేరీ జలాలు విడుదలకు ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కావేరీ జలాల పంపిణీ విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి ఊరట కల్పించింది. తమిళనాడుకు కావేరీ నీటి విడుదలపై కర్ణాటకకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాలు CWMA ఆదేశాల అమలుపై భిన్న వాదనలు వినిపించడంతో ఈ వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. తమిళనాడుకు నీటి విడుదలపై కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ (CWRC) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆగస్టు 12 నుంచి 15 రోజుల పాటు రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేయాలని CWRC ఆదేశించింది. అనంతరం ఈ నిర్ణయాన్ని CWMA కూడా సమర్థించింది.
Also Read
ఆదేశాలు పాటించడం లేదన్న తమిళనాడు
CWMA ఆదేశాలను కర్ణాటక సరిగ్గా అమలు చేయడం లేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే తమిళనాడు చెబుతున్న పరిస్థితి “చాలా తప్పుగా ఉంది” అని కర్ణాటక తరఫు న్యాయవాది శ్యామ్ దివాన్ పేర్కొన్నారు. తమిళనాడు తరఫున సీనియర్ న్యాయవాది సి.ఎస్. వైద్యనాథన్ వాదిస్తూ.. కర్ణాటక తన సాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తోందని.. తమిళనాడుకు మాత్రం చాలా తక్కువ నీరు అందుతోందని తెలిపారు. కర్ణాటక జలాశయాల్లో 76 శాతం లైవ్ స్టోరేజ్ ఉన్నప్పటికీ తమిళనాడుకు రావాల్సిన నీటిని విడుదల చేయడం లేదని ఆరోపించారు. దీంతో కర్ణాటక నీటిని ఎందుకు విడుదల చేయడం లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
తీవ్ర నీటి కొరత ఉందన్న కర్ణాటక
కర్ణాటక తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదిస్తూ.. రాష్ట్రం తీవ్ర నీటి కొరత పరిస్థితిని ఎదుర్కొంటోందని తెలిపారు. కావేరీ బేసిన్లో భారీ నీటి లోటు ఉందని.. ఈ పరిస్థితిని CWMA కూడా పరిగణనలోకి తీసుకుని నీటి విడుదలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఆగస్టు 11 వరకు 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు గతంలో ఆదేశాలు ఉన్నాయని దివాన్ తెలిపారు. ఆ తర్వాత ఆగస్టు 12 నుంచి రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని ప్రస్తుత ఆదేశాలు ఉన్నాయని చెప్పారు.
రోజుకు 12,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం కష్టమైన విషయమేనని ఆయన అంగీకరించారు. అయినప్పటికీ ఆ స్థాయిని కొనసాగించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మొదటి మూడు, నాలుగు రోజుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉన్నప్పటికీ.. రానున్న రోజుల్లో ఆ లోటును భర్తీ చేస్తామని కోర్టుకు వివరించారు.
వర్షాలు తక్కువగా కురిసిన ఈ ఏడాది తమకు రావాల్సిన కావేరీ నీటి వాటా అందడం లేదని తమిళనాడు ప్రభుత్వం గతంలోనే ఆరోపించింది. ఈ విషయంపై ఆగస్టు 3న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. CWRC కేటాయించిన నీటి పరిమాణం, కర్ణాటక విడుదల చేస్తున్న నీరు తమ అవసరాలకు చాలా తక్కువగా ఉందని పేర్కొంది.
తమిళనాడు ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 28న జరిగిన CWRC సమావేశంలో జూలై 29 నుంచి 15 రోజుల పాటు రోజుకు 3,500 క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేయాలని ఆదేశించింది. అయితే జూలై 29 నుంచి ఆగస్టు 2 మధ్య బిలిగుండ్లు దగ్గర నమోదైన వాస్తవ నీటి ప్రవాహం 158 నుంచి 550 క్యూసెక్కుల మధ్య మాత్రమే ఉందని తమిళనాడు తెలిపింది.
కర్ణాటక జలాశయాల్లో…
ఆగస్టు 3 నాటికి కర్ణాటకలోని కేఆర్ఎస్, కబినీ, హారంగి, హేమావతి జలాశయాల్లో కలిపి 77.537 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ పరిస్థితుల్లో తమకు రావాల్సిన వాటా నీటిని విడుదల చేయడంలో కర్ణాటకకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది. కేఆర్ఎస్, కబినీ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో ఇటీవల వర్షాలు కురిసిన నేపథ్యంలో బిలిగుండ్లు వద్ద తమిళనాడుకు రావాల్సిన నీటి వాటా 26.954 టీఎంసీలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే CWMA కేటాయించిన 4.536 టీఎంసీలు చాలా తక్కువ అని అభ్యంతరం వ్యక్తం చేసింది. తమకు రావాల్సిన 26.954 టీఎంసీల పూర్తి వాటాను కర్ణాటక విడుదల చేయలేదని ఆరోపించింది.
ఆగస్టు 24న తదుపరి విచారణ
ఇరు రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కావేరీ నీటి విడుదలపై తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు కేసును ఆగస్టు 24కి వాయిదా వేసింది. అప్పటికి నీటి విడుదలకు సంబంధించిన తాజా స్టేటస్‌ను కోర్టు ముందుంచాలని సూచించింది. అదే సమయంలో CWMA ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరిగా పాటించేలా చూడాలని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో తదుపరి విచారణలో కర్ణాటక నుంచి విడుదలైన నీటి పరిమాణం, తమిళనాడుకు చేరిన నీరు, CWMA ఆదేశాల అమలు వంటి అంశాలపై సుప్రీంకోర్టు మరింత స్పష్టత కోరే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Supreme Court: కర్ణాటకకు బిగ్ షాక్.. తమిళనాడుకు కావేరీ జలాలు విడుదలకు ఆదేశం
-
Ravindra Jadeja: మైండ్ బ్లోయింగ్ రికార్డ్.. అనిల్ కుంబ్లే తర్వాత ఆ మైలురాయి దాటిన ‘స్టార్ ఆల్‌రౌండర్’..
-
RAPO 23 : రామ్ పోతినేని డెడికేషన్: డైరెక్షన్ చేస్తూనే 24 గంటల ఏకధాటి షూటింగ్!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ కేసులో ఛార్జ్‌షీట్.. భర్త, అత్తపై సంచలన రిపోర్ట్
-
CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!