Punjab: గురుద్వారాలో పవిత్ర గ్రంథం పేజీలు చింపేశాడని.. యువకుడిని కొట్టి చంపేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab: పంజాబ్‌లోని గురుద్వారాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారాలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ పేజీలను చింపేశాడనీ.. ఓ 19 ఏళ్ల యువకుడిని పట్టుకుని స్థానిక ప్రజలు శనివారం సాయత్రం తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బండాలా గ్రామంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బక్షిష్ సింగ్ అనే యువకుడు గురుద్వారా ప్రాంగణంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత పవిత్ర గ్రంథంలోని కొన్ని పేజీలను చింపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. యువకుడు పవిత్ర గ్రంథంలోని పేజీలు చింపేసి పారిపోతున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని అడ్డగించారు. అందరూ కోపంతో ఊగిపోతూ.. స్థానిక ప్రజలు సదురు యువకుడిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. దాంతో బక్షిస్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు.
Read Also: Terrorist Attack: వైమానిక దళం కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడిని ఖండించిన ఖర్గే, రాహుల్
Also Read
ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.యువకుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను అప్పడికే చనిపోయాడని తెలిపారు. ఆ వ్యక్తిపై హత్యాయత్నానికి పాల్పడినందుకు పోలీసు కేసు నమోదైంది. కాగా.. అంతకుముందు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సౌమ్య మిశ్రా సహా.. ఇతర ఉన్నతాధికారులు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామనీ దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. అతను మానసిక వికలాంగుడని, రెండేళ్లుగా మందులు వాడుతున్నాడని అతని తండ్రి లఖ్వీందర్ సింగ్ చెప్పారు. తన కొడుకును చంపిన వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరారు.
తాజావార్తలు
-
Mohammad Kaif: రోహిత్, కోహ్లీ కాదు.. 2027 వరల్డ్ కప్ గెలవాలంటే భారత్‌కు ఇదే కీలకం..
-
APPSC: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీపీఎస్సీ నుంచి 5 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల..
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?