AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Panel Speakers: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్యానల్ స్పీకర్లను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. శాసనసభ కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ఆరుగురు సభ్యులను ప్యానల్ స్పీకర్లుగా నియమించారు. ప్యానల్ స్పీకర్లుగా మండలి బుద్ధ ప్రసాద్, కోళ్ల లలిత కుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజు, వరద రాజుల రెడ్డి, దాసరి సుధలను నియమించినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శాసనసభ సమావేశాల సమయంలో స్పీకర్ అందుబాటులో లేని సందర్భాల్లో సభా కార్యక్రమాలను నిర్వహించడంలో ప్యానల్ స్పీకర్లు కీలక పాత్ర పోషిస్తారు. తాజాగా ప్రకటించిన ఈ నియామకాలతో సభా వ్యవహారాలు మరింత సజావుగా కొనసాగేందుకు అవకాశం ఉంటుంది.
మరోవైపు.. డీఎస్సీ (DSC)తో పాటు ఇతర అంశాలపై వైసీపీ అధినేత జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు బయట, రోడ్లపై మాట్లాడటం కాకుండా ఏమైనా అనుమానాలు, సందేహాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సూచించారు. సభలోనే ప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అయ్యన్నపాత్రుడు.. ఎక్కడో రోడ్లపై మాట్లాడిన అంశాలకు సమాధానం చెప్పాలంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్ ఎమ్మెల్యేగా, ఆయన పార్టీకి చెందిన సభ్యులు శాసనసభకు వచ్చి తమ సమస్యలు, అనుమానాలను సభలో ప్రస్తావించాలని సూచించారు. జగన్‌కు ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా తాను ఎలా ఇవ్వగలనని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత హోదా అంశంపై గతంలోనూ తన వైఖరిని స్పష్టం చేసినట్లు తెలిపారు.
Also Read
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అయ్యన్నపాత్రుడు సూచించారు. సభలో సంబంధిత మంత్రులు అందుబాటులో ఉంటారని, ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు మంత్రులతో సమాధానాలు ఇప్పించే బాధ్యతను స్పీకర్‌గా తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. డీఎస్సీ నియామకాలు, ఇతర ప్రభుత్వ అంశాలపై వైసీపీకి ఏవైనా సందేహాలు ఉంటే వాటిని అసెంబ్లీ వేదికగా లేవనెత్తితే ప్రభుత్వం సమాధానం చెప్పే అవకాశం ఉంటుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చకు శాసనసభే సరైన వేదిక అని స్పష్టం చేశారు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు..
తాజావార్తలు
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!