సీఎస్ జవహర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. పెన్షన్ దారులు పడుతున్న ఇబ్బందులపై లేఖలో ప్రస్తావించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు సామాజిక పెన్షన్ల లబ్దిదారుల్ని వేధిస్తున్నారని.. అధికార పార్టీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం బాధాకరమని లేఖలో చంద్రబాబు తెలిపారు.
దేశంలో 2014కి ముందు 2014 తరవాత అన్నట్టు చూడాలని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకు వస్తా అని.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా నని హామీలు ఇచ్చి మోసం చేశారని, భారతీయ జుమ్లా పార్టీ గా మారింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ ద్రోహి అని ముద్ర వేస్తున్నారని మధు యాష్కీ విమర్శించారు. కరోనా వస్తే మోడీ దీపాలు…
ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని.. అవకాశం కల్పించండని, మీలో ఒక్కరిగా మీ అడుగుజాడల్లో నడుస్తూ మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తానని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. గురువారం కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం, ఉత్తరపల్లి, చెర్లోపల్లి, కుమ్మరపల్లి, చేరెడ్డిపల్లె, చిన్నారికట్ల, పెద్దారికట్ల గ్రామాల్లోని పలు వీధుల్లో మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారం నిర్వహించారు.
పాకిస్థాన్ దేశంలో దారుణం చోటు చేసుకుంది. ఇవాళ (శుక్రవారం) వాయువ్య పాకిస్తాన్‌లోని కొండ ప్రాంతం నుంచి ప్రయాణీకులతో కూడిన బస్సు లోయలో జారిపడటంతో దాదాపు 20 మంది వరకు మరణించారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. తమ నియోజకవర్గంలో గడపగడపకు వెళ్తూ.. తమ పార్టీ చేసిన మంచి పనులను వివరిస్తూ, ఓటేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే.. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్‌పల్లిలో ఆయన తరుఫున కేటీఆర్ ప్రచారంలో పాల్గొన్నారు.
అంబేడ్కర్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామానికి రాజ్యాంగాన్ని తీసుకెళ్తాం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. అంబేడ్కర్ పంచ తీర్థ స్థలాలను అభివృద్ధి చేశామని, పార్లమెంట్ లో తొలిసారి అంబేడ్కర్ ఫోటో పెట్టింది అటల్ జీ.. బీజేపీ అని ఆయన అన్నారు. ఇక్కడ కూడా అంబేడ్కర్ ఫోటో పెట్టాలని ధర్నాలు చేసి.. లాఠీలతో కొట్టించారని, సబ్ కా సాథ్.. సబ్…
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలుకుతున్నారు. బహిరంగ సభలకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. కూటమిపై పార్టీలపై విమర్శలు ఎక్కుపెడుతూ ప్రచారపర్వంలో ముందుకెళ్తున్నారు జగన్.