Kareena Kapoor: యునిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా కరీనా కపూర్ నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kareena Kapoor: యునిసెఫ్ ( యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్-UNICEF ) ఇండియా నేషనల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటి కరీనా కపూర్‌ను నియమించారు. ఈ విషయాన్ని యునిసెఫ్ శనివారం ప్రకటించింది. 2014 నుంచి ఆమె యునెసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. మే 4న (శనివారం) ఆమె నియామకం ఖరారైంది. గత పదేళ్లుగా కరీనాకు యూనిసెఫ్‌తో అనుబంధం ఉంది. 2014 నుంచి ఆమె యూనిసెఫ్ సెలెబ్రిటీ అడ్వకేట్‌గా కొనసాగుతున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కరీనా ఉద్వేగంతో ప్రసంగించారు. భావి తరానికి ప్రతినిధులైన పిల్లల హక్కులు కాపాడుకోడానికి పోరాటం సాగించేలా , యునిసెఫ్‌తో తన సంబంధం ఈ విధంగా కొనసాగేలా రాయబారిగా గౌరవించడం తనకు గర్వకారణంగా ఉందని ఆమె భావోద్వేగంతో మాట్లాడారు. ఈ సందర్భంగా యునిసెఫ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో అణగారిన పిల్లల కోసం, వారి హక్కుల కోసం తన గళం విప్పి పోరాటం సాగిస్తానన్నారు. పిల్లల చదువు, లింగసమానత కోసం పాటుపడతానని చెప్పారు. కరీనాతోపాటు మరో నలుగురు యువ న్యాయవాదులను యునిసెఫ్ నియమించింది.
Read Also: RCB vs GT: విరాట్ కోహ్లీ బుల్లెట్ త్రో.. షారూఖ్ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్!
Also Read
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
వాతావరణ సమస్య, మానసిక ఆరోగ్యం, నూతన ఆవిష్కరణలు, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమెటిక్స్ (స్టెమ్స్) తదితర రంగాలకు కృషి చేసేలా నలుగురు అడ్వకేట్లను నియమించింది. ఆ నలుగురిలో గౌరంశీ శర్మ (మధ్యప్రదేశ్) పిల్లలు ఆడుకునే హక్కు, వికలాంగులైన పిల్లలను కూడా వీరిలో కలుపుకోవడంలో కృషి చేస్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్తీక్ వర్మ వాతావరణ మార్పుల సమస్య, బాలలహక్కుల సాధనకు కృషి చేస్తారు. గాయని నహీడ్ అఫ్రిన్ (అస్సాం) మానసిక ఆరోగ్యం, చిన్న పిల్లల అభివృద్ధికి ప్రయత్నిస్తారు. తమిళనాడుకు చెందిన వినీషా ఉమాశంకర్ వర్ధమాన ఆవిష్కర్తల కోసం, స్టెమ్ సారధిగా పనిచేస్తారు. ఈ విధంగా ప్రపంచం మొత్తం మీద 93 యువ అడ్వకేట్లను యునిసెఫ్ నియమించింది. కరీనా కపూర్ నేషనల్ అంబాసిడర్‌గా ఎన్నికవడంతో యూనిసెఫ్ ఇండియాలో కొత్త ఉత్సాహం నిండిందని యూనిసెఫ్‌లో భారత ప్రతినిధి సింథియా మెక్‌కాఫ్రే అన్నారు. అనేక జాతీయ , అంతర్జాతీయ కార్యక్రమాలకు సహకరించడం ద్వారా ఆమె నూతన ఉత్తేజాన్ని తీసుకురాగలరని ఆశించారు.
తాజావార్తలు
-
తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
-
UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!