ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. గడపగడపకు తిరుగుతూ తమకు ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. తాము అధికారంలోకి వస్తే.. సంక్షేమం, అభివృద్ధి పథకాలను తీసుకొస్తామంటూ చెబుతూ ముందుకెళ్తున్నారు.
కెనడా పర్యటనకు వెళ్లిన భారతీయ దంపతులు.. వారి మూడు నెలల మనవడు సహా నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మద్యం మత్తులో రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో.. ఈ ప్రమాదం జరిగిందని అక్కడి పోలీసులు చెబుతున్నారు. టొరంటోకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విట్బీలోని హైవే 401లో నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారని అంటారియో పోలీసులు గురువారం తెలిపారు.
ఏపీలో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వడగాలులు కొనసాగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రేపు 58 మండలాల్లో తీవ్రవడగాల్పులు,169 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 78 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 273 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
కజకిస్థాన్ మాజీ ఆర్ధిక మంత్రి కువాండిక్ బిషింబాయేవ్ (44) తన భార్య సాల్టానాట్ (31) ను కొట్టి చంపాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డయింది. సాల్టానాట్ నుకెనోవా గత నవంబర్‌లో ఓ రెస్టారెంట్లో శవమై కనిపించింది. ఆ రెస్టారెంట్లో 8 గంటలపాటు తనభార్య సాల్టానాట్ పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో మెదడుకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మరణించింది.
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవని, పీక్ డిమాండ్ లో కూడా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుండగా బిఆర్ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపు కోవడానికి అసత్య ప్రచారం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు తప్పుపట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంటు పోతదని అసెంబ్లీ ఎన్నికల ముందు బి ఆర్ ఎస్ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ ప్రజలు…
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దాసరి పల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు. పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో వీరంతా పసుపు కండువా కప్పుకున్నారు. మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బయన్న ..రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలపై తనకు, సీఎం జగన్‌కు అమితమైన ప్రేమ ఉందని.. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ముంబై ఇండియన్స్- కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై.. ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది.
‘హలో…మీ అబ్బాయి రేప్ కేసులో చిక్కుకున్నాడు. అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాం. మీరు అతన్ని విడిపించాలనుకుంటే వెంటనే ఈ నంబర్‌కు కాల్ చేయండి. మీకు కూడా అలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కాలర్ చెప్పినట్లుగా వింటే మాత్రం.. మీ బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. అంతేకాకుండా.. సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అవును, దేశంలో ఇలాంటి మోసం ఘటనలు చాలానే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు…
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. యూపీలోని ఫతేహాబాద్లో రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వామి ప్రసాద్ మౌర్య పర్యటిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి హోతమ్ సింగ్ మద్దతుగా సభలో ప్రసంగిస్తుంగా స్వామి ప్రసాద్ మౌర్యపై ఓ యువకుడు షూ విసిరాడు. అయితే స్వామి ప్రసాద్ మౌర్య తృటిలో తప్పించుకున్నారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు.. సభా స్థలికి వెళుతున్న స్వామి ప్రసాద్ మౌర్యకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నిరసన చేపట్టారు.