Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
- విత్తనాలు లేకుండానే కొత్తిమీర కాడలతో మొక్క..
- తాజాగా, పచ్చగా ఉన్న కొత్తిమీర కాడలను ఎంచుకోవాలి
- కొత్తిమీర కాడల దిగువ భాగాన్ని నీటిలో ఉంచాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coriander at Home: వంటకాల రుచిని మాత్రమే కాదు.. మంచి సువాసనను కూడా పెంచుతుంది కొత్తిమీర. అందుకే దాదాపు ప్రతి వంటకంలోనూ కొత్తిమీరను ఉపయోగిస్తుంటారు మన భారతీయులు. అయితే మార్కెట్ నుంచి తెచ్చిన కొత్తిమీరను ఎంత జాగ్రత్తగా నిల్వ చేసినా కొద్ది రోజుల్లోనే వాడిపోవడం లేదా కుళ్లిపోవడం సాధారణంగా చూస్తూ ఉంటాము. దీంతో తరచూ మార్కెట్‌కు వెళ్లి కొత్తిమీర కొనాల్సి వస్తుంటుంది. అయితే ఇకపై కొత్తిమీర కాడలను పడేయకుండా వాటితోనే ఇంట్లో కొత్త మొక్కను పెంచుకోవచ్చు. ఇందుకోసం ఖరీదైన విత్తనాలు, ప్రత్యేకమైన పరికరాలు అవసరం లేదు. సరైన కాడ, కొద్దిగా నీరు, మంచి వెలుతురు ఉంటే చాలు. కిటికీ దగ్గర లేదా బాల్కనీలోనే కొత్తిమీరను పెంచవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా..
కొత్తిమీర కాడలతో మొక్క:
ముందుగా మార్కెట్ నుంచి తాజాగా, పచ్చగా ఉన్న కొత్తిమీరను తీసుకోవాలి. ఆకులను ఉపయోగించిన తర్వాత కాడలను పడేయకుండా పక్కన పెట్టుకోవాలి. ముఖ్యంగా కాడ దిగువ భాగంలో కొంత వేరు లేదా వేరు పెరిగే అవకాశం ఉన్న భాగం ఉంటే మంచిది. ఇప్పుడు ఒక శుభ్రమైన గ్లాస్ లేదా చిన్న జార్లో నీటిని తీసుకుని కొత్తిమీర కాడల దిగువ భాగాన్ని అందులో ఉంచాలి. మొత్తం కాడను నీటిలో ముంచకూడదు. కేవలం కింది భాగం మాత్రమే నీటిలో ఉండేలా చూసుకోవాలి. ఈ గ్లాస్‌ను మంచి వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచాలి. అంటే కిటికీ దగ్గర పెట్టడం అలా అనామటా.. ఇలా చేసిన కొంతకాలం తర్వాత కాడల నుంచి కొత్త వేర్లు, చిన్న పచ్చని ఆకులు రావడం మనం గమించవచ్చు.
Also Read
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
- Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన "కారప్పొడులు" సులువుగా చేసుకోండి ఇలా..!
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
జాగ్రత్తలు గుర్తుంచుకోండి..
నీటిలో కొత్తిమీరను పెంచడం సులభమే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. గ్లాస్‌లోని నీటిని క్రమం తప్పకుండా మార్చాలి. నీరు మురికిగా మారితే కాడలు కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మొక్కకు మంచి వెలుతురు అందేలా చూడాలి. అయితే ఎక్కువ ఎండ లేదా వేడి తగలకుండా జాగ్రత్తపడాలి. కొత్త ఆకులు పెరుగుతున్న కొద్దీ అవసరమైనంత మేరకు వాటిని కోసుకుని వంటల్లో ఉపయోగించుకోవచ్చు.
మట్టిలో కూడా కొత్తిమీర పెంపకం:
కొత్తిమీర మొక్కను ఎక్కువ కాలం పెంచుకోవాలనుకుంటే కాడలను మట్టిలోకి మార్చడం మంచి మార్గం. ఇందుకోసం వేర్లు ఉన్న కాడ భాగాన్ని నీరు సులభంగా బయటకు వెళ్లిపోయేలా ఉండే తేలికపాటి మట్టిలో నాటాలి. మట్టిని తేమగా ఉంచాలి. అయితే ఎక్కువగా నీరు పోయకూడదు. కుండను మంచి వెలుతురు వచ్చే ప్రదేశంలో ఉంచాలి. సరైన సంరక్షణ అందితే కాడ నుంచి కొత్త ఆకులు రావడం ప్రారంభమవుతాయి.
కేవలం కొత్తిమీర కాడలను నీటిలో ఉంచినంత మాత్రాన ప్రతిసారీ పెద్ద మొత్తంలో ఆకులు వస్తాయని చెప్పలేం. కొత్త మొక్క పెరగాలంటే కాడలో జీవ కణజాలం, వేర్లు లేదా వేర్లు పెరిగే సామర్థ్యం ఉన్న భాగం ఉండటం చాలా ముఖ్యం. అందుకే వేర్లతో మిగిలిన తాజా కాడలను ఉపయోగించడం మంచిది. కాడల నుంచి కొత్త ఆకులు రావడం ప్రారంభమైన తర్వాత వాటిని మట్టిలోకి మార్చితే మొక్క మరింత స్థిరంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా వంటల్లో ఉపయోగించిన కొత్తిమీర కాడలను పడేయకుండా మళ్లీ పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు. కొద్దిపాటి జాగ్రత్తలతో ఇంటి కిటికీ, బాల్కనీ లేదా చిన్న కుండలోనే తాజా కొత్తిమీరను పెంచుకోవచ్చు.
తాజావార్తలు
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!