ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డులు సృష్టించాడు.
కటక్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులు చేసింది. 305 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. భారత్ ఇంకా 33 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ STF అధికారులు సీజ్ చేశారు. పది కిలోల గంజాయిని పట్టుకున్నారు. అరకు నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలకు వెళ్లిన కొడుకు ఇంటికి ఆలస్యంగా వచ్చాడని కన్న కొడుకుని కొట్టి చంపాడు ఓ తండ్రి.. ఈ ఘటన చౌటుప్పల్ రూరల్ ఆరేగూడెం గ్రామంలో జరిగింది. అయితే పాఠశాలలో ఓ అవార్డ్ ప్రోగ్రాంలో పాల్గొన్న కొడుకు.. అక్కడ ఆలస్యం అయింది. ఈ క్రమంలో ఇంటికి ఆలస్యంగా రావడంతో కొడుకు భానుని(14) తండ్రి సైదులు కొట్టి చంపాడు.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఇంటిపై దాడికి పాల్పడ్డారు. వీర రాఘవ రెడ్డి అనే వ్యక్తి 20 మందితో కలిసి వచ్చి దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి తన అనుచరులతో కలిసి విచక్షణ హంగామా చేశాడు వీర రాఘవరెడ్డి. దీంతో ఈ ఘటనపై అర్చకులు రంగరాజన్ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీసీ నాయకుల సమావేశం నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ సీనియర్ నేతలు, ముఖ్య నాయకులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం చేసిన నయవంచనను అసెంబ్లీలో, మండలిలో ఎండగట్టామని అన్నారు. తప్పుల తడకగా ఉన్న కులగణనను మళ్లీ నిర్వహించాలని కోరామని తెలిపారు.
మలయాళీ దినపత్రిక మాతృభూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాజ్యాంగం ప్రసాదించిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నది ప్రాంతంలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బాలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కాల్పులు జరిగాయి. డీఆర్జీ అండ్ ఎస్టీఎఫ్ బస్తర్ ఫైటర్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. ఉదయం నుండి ఈ ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు, ఇద్దరు జవాన్లు చనిపోయారు.
మీసేవ ద్వారా రేషన్ కార్డుల దరఖాస్తులపై పౌరసరఫరాల శాఖ క్లారిటీ ఇచ్చింది. మీసేవ ద్వారా కొత్తగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని మాత్రమే "మీసేవ"ను కోరినట్లు పౌరసరఫరాల శాఖ కమిషన్ డీఎస్ చౌహాన్ తెలిపారు.