వైద్యాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారు కొందరు డాక్టర్లు.. ఆసుపత్రిలో చేరే పేషెంట్ల ఆర్ధిక స్థితిని బట్టి.. వాళ్ల అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకొని డబ్బులు లాగేస్తున్న ఘటనలు నిత్యం ఏదో ఓ చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఠాగూర్ సినిమాలో ప్రాణం పోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తున్నట్లుగా మేనేజ్ చేసి పేషెంట్ల నుంచి డబ్బులు వసూలు చేసే సీన్ అందరికి గుర్తుండిపోతుంది.
ఢిల్లీలో బీజేపీ విజయంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ఆప్‌కు ఢిల్లీ ప్రజలు పట్టం కడుతూ వచ్చారు.. 27 ఏళ్ల తర్వాత బీజేపీని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారని తెలిపారు. మోడీ సుపరిపాలనకు ప్రజలు ఆశీస్సులు అందించారు.. ఢిల్లీకి పట్టిన కేజ్రీవాల్ గ్రహణం.. దేశ రాజధానికి పట్టిన పీడ విరగడైందని ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పట్ల బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని.. ఈ ఎన్నికలలో స్పష్టం అవుతోందని ఆయన అన్నారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందని ఆరోపించారు.
వివో (Vivo) ఎట్టకేలకు భారతదేశంలో తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V50 యొక్క లాంచ్ తేదీని ప్రకటించింది. ఈ ఫోన్ 2025 ఫిబ్రవరి 18న భారతదేశంలో లాంచ్ అవుతుంది. ప్రస్తుతం వివో V50 Pro గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారం పంచుకోలేదు. ఇది వివో V40 యొక్క అప్‌గ్రేడ్ వేరియంట్‌గా లాంచ్ అవుతుంది.
జీవితంలో మంచి, చెడు రకాల మనుషులు ఉంటారు. మనకు మంచి చేసే వారు కొందరైతే.. చెడు చేసే వారు ఎంతో మంది. అయితే.. ఎక్కువగా మనుషులు కూడా మంచి వాళ్లను నమ్మరు.. చెడు వాళ్లను కానీ, వాళ్ల మాటలనే నమ్ముతారు. దీంతో.. వారు మనకు తెలియకుండానే మనల్ని చాలా మోసం చేస్తారు. అందుకోసమని.. తియ్యగా మాట్లాడే వాళ్లను నమ్మొద్దని సూచిస్తారు.
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సెంచరీల పరంపర కొనసాగిస్తున్నాడు. ఇటీవల అతను నాలుగు సెంచరీలు సాధించాడు. గత 8 ప్రొఫెషనల్ మ్యాచ్‌లను కూడా కలుపుకుంటే అతను మొత్తం 5 సెంచరీలు సాధించాడు. వాటిలో ఒకటి టీ20 లీగ్‌లో జరిగింది. తాజాగా.. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో స్మిత్ సెంచరీ సాధించి అనేక రికార్డులు సాధించాడు. స్టీవ్ స్మిత్ 191 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇది అతని టెస్ట్ క్రికెట్లో 36వ సెంచరీ.
ఫిబ్రవరి 9న కటక్‌లో భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉంటాడా..? రెండో వన్డేలో కోహ్లీ ఆడుతాడా లేదా అన్నది భారత వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ అప్ డేట్ ఇచ్చాడు. అభిమానులకు గిల్ గుడ్ న్యూస్ చెప్పాడు. విరాట్ కోహ్లీ గాయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కటక్‌లో జరిగే రెండో వన్డేకు కోహ్లీ తిరిగి జట్టులోకి వస్తాడని ఆయన తెలిపాడు.
తీన్మార్ మల్లన్న విషయంలో తనకు మాట్లాడేంత టైమ్ లేదని.. మాట్లాడం వేస్ట్ అని అన్నారు. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ, ఏఐసీసీ, క్రమశిక్షణ చైర్మన్ చిన్నారెడ్డి నోటీసులు ఇచ్చినట్లు పేపర్లో చూశానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.6 శాతం బీసీలు ఉన్నట్లుగా తేల్చామని తెలిపారు.
పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడుతున్న వారు ఇద్దరూ దొందు దొందే అని విమర్శించారు.