కులగణనలో వివరాలు నమోదు చేసుకోని వారికి మరో అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం.. రేపటి నుండి 28వ తేదీ వరకు (అంటే 12రోజుల పాటు) రీ సర్వే చేపట్టనుంది. అందుకోసం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక కాల్ సెంటర్ 040-21111111 ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది.
రామరాజ్యం వీర రాఘవరెడ్డి కేసులో సంచలన అంశాలు వెలుగు చూశాయి. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ఉన్నట్లు తేలింది. తనకు తాను శివుడి అవతారం అని క్రియేట్ చేసుకున్నాడు వీర రాఘవరెడ్డి. శివుడి అవతారం ధరించాను అంటూ రామరాజ్యంలో రిక్రూట్మెంట్ కూడా చేశాడు.
సికింద్రాబాద్‌లో గంజాయి కలకలం రేపుతోంది. 15 కేజీల గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేశారు. ఒరిస్సా నుండి సికింద్రాబాద్ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.
ఖమ్మం జిల్లాలో పేరుకే ముగ్గురు మంత్రులు, అభివృద్ధిలో మాత్రం శూన్యమని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. అభివృద్ధి చేయలేని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని మండిపడ్డారు.
నిజామాబాద్ మార్కెట్ యార్డులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్ పై కార్మికులు దాడికి పాల్పడ్డారు. పోలీస్ వాహనాన్ని అడ్డుకుని మరి కార్మికులు దాడి చేశారు. పసుపు దొంగతనం ఆరోపణలు నిరసిస్తూ పసుపు కాంటాలు నిలిపివేసి కార్మికులు ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు కల్పించిన తర్వాత ఓట్లు అడగాలి…. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో భాగంగా వేములవాడ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశలంఓ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజి రెడ్డి మాట్లాడుతూ.. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 12 లక్షల 75 వేల పన్ను మినహాయింపు ఇచ్చింది..చాలా మందికి వేసులు బాటు…
బర్డ్ ఫ్లూపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కోళ్ల మృతికి గల కారణాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మూడు మ్యాచ్‌ల వన్డేల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను వైట్‌వాష్ చేసింది. బుధవారం జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ ఇంగ్లాండ్‌ను 142 పరుగుల తేడాతో ఓడించింది. 357 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లండ్.. 34.2 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది.