బీట్రూట్ అనేది ఒక సమృద్ధిగా పోషకాలు కలిగిన కూరగాయ. దీని రసం ప్రతిరోజూ తాగడం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. బీట్రూట్ రసంలో నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ C ఉన్నందున.. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, జ్ఞాపకశక్తిని పెంచడం, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఇంగ్లాండ్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలో.. 248 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇప్పటివరకు అనేక అధ్యయనాలలో పురుషుల కంటే స్త్రీలు తక్కువ గుండెపోటు ప్రమాదాలకు గురవుతారని కనుగొన్నారు. అయితే.. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో మెనోపాజ్ (రుతుక్రమం ఆగిపోవడం) అనుభవించిన స్త్రీలు గుండె సంబంధిత వ్యాధులు పట్ల తక్కువగా ప్రభావితం అవుతారని వెల్లడైంది. వారి రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయని.. దీని ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనం తెలిపింది.
ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. తాజాగా.. తెలంగాణ ఎడ్‌సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం వచ్చే నెల (మార్చి) 10న నోటిఫికేషన్ ఇవ్వనుంది. మార్చి 12 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు.
డాన్స్ చేస్తూ కుప్పకూలిన ఇంటర్ విద్యార్ధిని.. చివరికి మహబూబాబాద్ జిల్లాలో డాన్స్ చేస్తూ విద్యార్ధిని మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమం చేపట్టారు.ఈ సాంస్కృతిక కార్యక్రమంలో డ్యాన్స్ వేస్తూ రోజా అనే ఇంటర్ ఫస్టియర్ సీఈసీ విద్యార్ధిని కుప్పకూలింది.. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ విద్యార్ధిని మృతి చెందినది.. విద్యార్ధిని స్వస్థలం…
స్వీడన్‌లోని ఓ స్కూల్లో కాల్పుల మోత.. 10మంది మృతి స్వీడన్ లో కాల్పుల ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి పాఠశాలలో చొరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అక్కడ అంతా భయానక వాతావరణం చోటుచేసుకుంది. కాల్పుల మోతతో ఆ ప్రాంతమంతా ఉలిక్కిపడింది. ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో దాదాపు 10 మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. దాదాపు 20 మంది వరకు గాయపడ్డారని…
నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ. ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్న మోదీ. అనంతరం ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం. నేడు బీసీ కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్. హాజరుకానున్న స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఢిల్లీలోనే మంత్రి నారా లోకేష్. నేడు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిని నారా లోకేష్ కలిసే అవకాశం.…
మా లక్ష్యం వికసిత్ భారత్.. అందుకే ప్రజలు మూడోసారి ఆశీర్వదించారు ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. దేశ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఆత్మ విశ్వాసం నింపిందని.. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం…
భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త..! ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ టీజర్‌ను ఓలా తాజాగా విడుదల చేసింది. అధికారిక లాంచ్ రేపు (ఫిబ్రవరి 5, 2025)న జరగనుంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లపై ఓ నజర్ వేసేద్దాం.
జనవరి 2025లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో నార్వే కొత్త రికార్డు సృష్టించింది. నార్వేలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రగతి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. జనవరి నెలలో అమ్ముడైన కొత్త కార్లలో 96% కంటే ఎక్కువ EVలు ఉన్నాయి.