దేశ వ్యాప్తంగా బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. సోమవారం బెంగళూరులోని ఆరు ప్రైవేట్ ఆసుపత్రులకు ఈమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో.. ఆ ఆసుపత్రుల్లో పోలీసులు డాగ్ స్క్వాడ్‌లు, బాంబ్ డిస్పోజల్ టీమ్‌లతో భారీ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. అయితే.. ఈ ఆసుపత్రుల ఆవరణలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఇది నకిలీ బెదిరింపు అని చెప్పారు. కాగా.. ఈ ఈ-మెయిల్‌ను ఆదివారం ఆసుపత్రులకు పంపించారు. ఈ-మెయిల్‌లో.. “నేను మీ భవనంలో పేలుడు పరికరాలను ఉంచాను. మరికొన్ని గంటల్లో అవి పేలిపోతాయి. బాంబును నిర్వీర్యం చేయడానికి మీకు కొన్ని గంటల సమయం ఉంది, లేకపోతే అమాయకుల రక్తం చిందిస్తుంది.” అని ఈ మెయిల్‌లో ఉంది.
PM Modi: థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీ 400 సీట్లు దాటుతుందనే రియాలిటీ నిజమైంది
జైపూర్ పాఠశాలలకు కూడా బెదిరింపులు వచ్చాయి
ఈరోజు తెల్లవారుజామున రాజస్థాన్‌లోని జైపూర్‌లోని నాలుగు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు కూడా ఈమెయిల్ ద్వారా బెదిరింపు రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో.. పోలీసులు పాఠశాలల నుంచి విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, స్నిఫర్ డాగ్‌లతో సోదాలు నిర్వహించారు. అనంతరం.. జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ.. ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారని.. ఈ మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి ఒక బృందం ప్రయత్నిస్తోందని తెలిపారు.
ఢిల్లీ-ఏసీఆర్‌లో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి
కొన్ని రోజుల క్రితం, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని వందలాది పాఠశాలల్లో ఇలాంటి ఈ-మెయిల్ భయాందోళనలను సృష్టించింది. కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపు వచ్చింది. అయితే, విచారణ తర్వాత ఈ బెదిరింపు పుకారు అని తేలింది.