బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నినాదం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఉంది. బీజేపీ 400 సీట్ల దాటడం గురించి, వివిధ అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత ‘అబ్కీ బార్, 400 పార్’ నినాదం వాస్తవరూపం దాల్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..?
ఎన్‌డిఎ వంటి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నారని, దేశ భవిష్యత్తును భద్రపరిచేందుకు వేడిగాలులు వచ్చినా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీజేపీ 400 సీట్లు దాటదని విపక్షాలు చెబుతున్నాయని.. ఈసారి నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని రాహుల్ గాంధీ బహిరంగ సభలో మాట్లాడరని ప్రధాని మోడీ అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. దీన్ని రెండు భాగాలుగా చేయడానికి ప్రయత్నించండి అని ప్రధాని మోడీ తెలిపారు. బీజేపీ 400 సీట్ల బెంచ్‌మార్క్‌ని సెట్ చేసుకుందని.. 399 సీట్లు, 398 సీట్లు వస్తాయని ప్రతిపక్షం ఆలోచించాలని పేర్కొన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
మరోవైపు.. 2014, 2019 ఎన్నికల వీడియోలను బయటకు తీయాలని ప్రధాని మోడీ తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను చూడండి.. నేను చేసిన ఆరోపణలన్నీ కరెక్ట్ అని రుజువయ్యాయని ప్రధాని మోడీ చెప్పారు. నేను చెప్పాను.. రాహుల్ గాంధీ వయనాడ్ నుండి పారిపోయి వేరే సీటు కోసం చూస్తాడని.. నేను చేసిన ఆరోపణలన్నీ సరైనవని నిరూపించబడ్డాయని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరా గాంధీ హయాంలో దేశం అత్యధిక ద్రవ్యోల్బణ రేటును చూసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను జాబితా చేస్తూ.. నేడు 1.5-2.5 లక్షల స్టార్టప్‌లు ఉన్నాయని.. వాటిలో అత్యధికం టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని, లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.