ఏపీలో సోమవారం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరగబోతుంది. రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాలతో పాటు.. 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో.. ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే ఎన్నికల ముందు.. ఓటర్లకు ప్రలోభాలు కొనసాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా.. డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈసీ ఎన్ని పకడ్బంధీ చర్యలు చేపట్టినప్పటికీ డబ్బులు, మధ్యం పంపిణీ జరుగుతుంది. అంతేకాకుండా.. డబ్బుల పంపిణీ విషయంలో కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తుతున్నాయి.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని ఆత్మహత్య పాల్పడింది. తనకు స్నేహితుల కంటే తక్కువ మార్కులు వచ్చాయని క్లాస్ రూమ్ లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘనపూర్ లోని హ్యాపీ ఆరఫాన్ హోమ్ లో ఘటన చోటు చేసుకుంది.. కాసర్ల సతీష్ కుమార్తె స్వప్న (20) తన చిన్నప్పుడే తల్లి చనిపోవడం వల్ల అతని తండ్రి అయిన సతీష్ 2009వ సంవత్సరంలో ఆర్ఫాన్ హోమ్ లో చేర్పించాడు..…
ఎన్నికల ఉద్యోగికి పాముకాటు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అందర్ బంద్ ఆశ్రమో న్నత పాఠశాల ఆవరణలో ఎన్నికల విధులకు వెళ్లిన ఉద్యోగి విపుల్ రెడ్డిని పాము కాటు వేసిన ఘటన కలకలం రేపింది. అక్కడి 15వ పోలింగ్ కేంద్రంలో టాయిలెట్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన్ను 108 అంబులెన్స్ లో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా విపుల్ రెడ్డి జైనథ్…
భారతదేశం యొక్క ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా , మీ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేటాయించిన పోలింగ్ బూత్‌కు వెళ్లి తన విలువైన ఓటు వేరొకరు వేసినట్లు ఒక పోలింగ్ ఏజెంట్ చెప్పినట్లు ఊహించుకోండి. ఈ పరిస్థితి చాలా అరుదుగా ఉన్నప్పటికీ, సాధారణ ఎన్నికల సమయంలో ఇది అసాధారణం కాదు. పోలింగ్ ప్రక్రియ యొక్క సమగ్రత , పారదర్శకతను కాపాడేందుకు, ఓటర్లు తమ ఓటును శాంతియుతంగా వేయడానికి ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టింది. ఒక వ్యక్తి తన…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ఆర్సీబీ 187 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని ఉంచింది. ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 రన్స్ సాధించింది. బెంగళూరు బ్యాటింగ్ లో అత్యధికంగా రజత్ పాటిదర్ (52) పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విల్ జాక్స్ (41), కెమెరాన్ గ్రీన్ (32*) పరుగులు చేయడంతో ఢిల్లీ ముందు ఫైటింగ్ స్కోరును ఉంచారు.
ప్రజ్వల్ కేసులో కర్ణాటక హోంమంత్రి కీలక సూచనలు సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేసింది. కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు బయటకు రాగానే.. దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం బయటకు పడగానే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. సిట్ లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు, నేతలకు…
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 141 పరుగులు చేసింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా.. ఈ ఐపీఎల్లో రాజస్థాన్‌కు ఇది వరుసగా మూడో ఓటమి. రాజస్థాన్ ఈ ఓటమితో ప్లేఆఫ్ పోరు మరింత…
హైదరాబాద్ & సికింద్రాబాద్ లోక్ సభ స్థానాలకు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం మిషన్ లు & పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. క్రిటికల్ ఏరియాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు ఆయా జోన్ల డీసీపీలు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మాట్లాడుతూ.. ఈస్ట్ జోన్ లో సమస్యత్మక సునితమైన ప్రాంతాలు ఉన్నాయని, ఈస్ట్ జోన్ లో 225 లోకేషన్ లో మొత్తం 539 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు గిరిధర్. వీటిలో 46 క్రిటికల్ పోలింగ్…
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఐదేళ్లకు ఒకసారి జరిగే ప్రజస్వామ్య వేడుకలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు, ధృడమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు ప్రశాంత వాతావరణంలో న్యాయంగా, పాదర్శకంగా జరిగే ఎన్నికలు ఎంతో కీలకమని, అటు వంటి ఎన్నికల్లో రాష్ట్రంలోని ఓటర్లు అంతా పాల్గొని ప్రజాస్యామ్య వ్యవస్థను పరిరక్షించు కోవాలని ఆయన విజ్ఞప్తి…
ఏపీలో రేపు జరగబోయే పోలింగ్ పై భారీ వర్ష సూచన ఉంటుందని ఆందోళన చెందుతున్న అధికారులకు, ఓటర్లకు విశాఖ వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పోలింగ్ నిర్వహణకు వరుణుడి ముప్పు తక్కువే అని సూచించింది. రేపు రాష్ట్రంలో వర్ష ప్రభావం పెద్దగా ఉండదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తారు వర్ష సూచన ఉంటుందని.. భారీ వర్ష సూచన లేదని పేర్కొన్నారు.