MP K.Laxman : పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని, మోడీ నీ గెలిపించాలని పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నామని, రెండు సార్లు అధికారం లో ఉన్న మోడీ పై వ్యతిరేకత కాకుండా సానుకూలత పెరిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్లే సత్తా ఆయనకు ఉందని ప్రజలు విశ్వసించారని, ఓట్లకోసం ఉచితాలు అయన ఇవ్వదని ప్రజలు భావించారన్నారు ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ కి ప్రతిపక్ష హోదా దక్కదని, రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసిన… ఉచితాల్ని , గ్యారంటీ లను ప్రజలు నమ్మలేదు….అలవి గానీ హామీలు ఇచ్చారన్నారు. అప్పు చేస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పెను సంక్షోభం లోకి నెట్టబోతుందని, BRS చచ్చిన పాము… కారు గారేజ్ నుండి వచ్చే అవకాశం లేదన్నారు లక్ష్మణ్.
అంతేకాకుండా..’కార్ ను స్క్రాప్ లో కూడా అమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ లో బీజేపీ ఒక శక్తివంతమైన పార్టీ గా ఎదగబోతుంది… భవిష్యత్ లో brs కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయం. అధికార దాహం కోసం గతం లో కెసిఆర్ కాంగ్రెస్ లో చేరలేదు. అవినీతి పరులు ఏకం అయ్యి ఇండి కూటమి కట్టారు. రుణమాఫీ అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి కి ఆగస్టు సంక్షోభం తప్పదు అని ప్రజలు అనుకుంటున్నారు. ఫేక్ వీడియో లు తయారు చేసి రేవంత్ రెడ్డీ ఫేక్ సీఎం గా పేరు తెచ్చుకున్నరు. రిజర్వేషన్ ల పై కాంగ్రెస్ అసలు స్వరూపం ప్రజలకు తెలుసు కాబట్టే ఆ పార్టీ ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. రేవంత్ రెడ్డి అతి ఉత్సాహం తో హామీలు గ్యారంటీ లు ఇచ్చారు… ప్రజలు తిరగపడతారు. .వారి పార్టీ నుండే ఆయనకు వ్యతిరేకత వస్తుంది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ తగ్గడానికి కారణం సీఎం మీద విశ్వాసం లేకపోవడమే. కేంద్రం 16 వేలు కోట్లు ఇవ్వకపోతే ఈ 5 యేళ్లు గడిచేది కాదు. పార్టీ కి సహకరించిన అందరికీ బీజేపీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తరపున ధన్యవాదాలు’ అని లక్ష్మణ్ అన్నారు.
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!