*తిరుమల: నేటితో ముగియనున్న పద్మావతి పరిణయోత్సవాలు.. ఇవాళ గరుడ వాహనంపై నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్న శ్రీవారు.
*నేడు సత్యసాయి, ఉమ్మడి కడప, తిరుపతి జిల్లాలకు వర్షసూచన.. అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు.. శ్రీకాకుళం, అల్లూరి , మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ ఎండీ సూచన.
*తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. కంపార్ట్‌మెంట్లు నిండి క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.. నిన్న రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 90,721 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 50,599 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు
*ఐదో దశ పోలింగ్‌కు ఈసీ ఏర్పాట్లు.. 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో 49 స్థానాలకు పోలింగ్.. 49 నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం ముగిసిన ప్రచారం.. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7 స్థానాలకు ఎన్నికలు.. ఒడిశాలో 5, బీహార్‌లో 5, జార్ఖండ్‌లో 3 నియోజకవర్గాలకు రేపు పోలింగ్.. జమ్ముకశ్మీర్‌లో 1, లడక్‌లో 1 స్థానానికి రేపు పోలింగ్.. కాంగ్రెస్‌కు కీలక స్థానాలు రాయబరేలీ, అమేథిలో రేపు పోలింగ్.. రాయబరేలీలో రాహుల్, అమేథిలో కేఎల్ శర్మ పోటీ.. బరిలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్.
*ఐపీఎల్: నేడు రెండు మ్యాచ్‌లు.. మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ వర్సెస్ పంజాబ్.. రాత్రి 7.30 గంటలకు రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా.
*తెలుగు రాష్ట్రాల్లో నేటి బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.74,620.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,400.. తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర రూ.96,500.