RCB vs CSK: చెన్నై ఓటమి.. ప్లేఆఫ్స్కు ఆర్సీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 27 పరుగుల తేడాతో గెలుపొందింది. 219 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 191 పరుగులు చేసింది. దీంతో చెన్నై ఓడిపోయింది. ఈ క్రమంలో.. ఆర్సీబీ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. చెన్నై బ్యాటింగ్లో చివర్లో జడేజా (42*) పరుగులతో ఆదుకున్నప్పటికీ చివరికి ఓటమిపాలైంది. ధోనీ కూడా (25) పరుగులతో రాణించాడు. చెన్నై బ్యాటర్లలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయి నిరాశపరిచాడు. ఆ తర్వాత రచిన్ రవీంద్ర (61) పరుగులతో రాణించాడు. డేరిల్ మిచెల్ (4), అజింక్యా రహానే (33) రన్స్ చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన శివం దూబే (7) పరుగులు చేశాడు. మిచెల్ సాంథ్నర్ (3) రన్స్ సాధించారు. ఆర్సీబీ బౌలింగ్ లో యష్ దయాళ్ కీలకమైన 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత గ్లేన్ మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గుసన్, కెమెరాన్ గ్రీన్ తలో వికెట్ సంపాదించారు. ఈ మ్యాచ్ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించగా, సీఎస్కే ఇంటి బాట పట్టింది.
Garlic Peels: వెల్లుల్లి తొక్కలను పడేస్తున్నారా.. వీటితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో..?
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటింగ్ లో అందరూ సమిష్టిగా రాణించారు. ఆర్సీబీ ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) పరుగులతో శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత.. రజత్ పటిదార్ (41) పరుగులతో చెలరేగాడు. కెమెరాన్ గ్రీన్ (38*) నిలిచాడు. దినేష్ కార్తీక్ (14), మ్యాక్స్ వెల్ (16) పరుగులు చేశారు. అత్యధికంగా.. కెప్టెన్ డుప్లెసిస్ 54 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 3 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 3 ఫోర్లు ఉన్నాయి. ఇక.. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత తుషార్ దేశ్ పాండే, మిచెల్ సాంథ్నర్ తలో వికెట్ సంపాదించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?