ఏపీ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది.
పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.
ఫైర్ క్రాకర్స్ పై అనంతపురం జిల్లాలో తాత్కాలికంగా నిషేధం విధించారు. జిల్లా ఎస్పీ గౌతమిశాలి సిఫారసు మేరకు కలెక్టర్ వినోద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే నెల ఆరో తేదీ వరకు టపాసుల తయారీ, కొనుగోలు, అమ్మకాలు, రవాణా వంటి వాటిపై కలెక్టర్ నిషేధం విధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలింగ్‌కు ముందు నుంచే పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. ఎన్నికల తర్వాత కూడా రెండు రోజులపాటు టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్న పరిస్థితి జిల్లాలో కనిపించింది.
కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. 40 మందికి పైగా ప్రయాణీకులకు తీవ్రగాయాలయ్యాయి.
ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున బరిలో దిగిన తీన్మార్ మల్లన్నను గెలిపించాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను గెలిపించేందుకు పనిచేయాలని పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డి దిశనిర్దేశం చేశారు. ఇవాళ రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న, మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్…
జగిత్యాల మార్కెట్లో మామిడి పండ్ల వ్యాపారం మందకొడిగా సాగుతోంది. సీజన్ ప్రారంభంలో జోరుగా ప్రారంభమైన వ్యాపారం క్రమేపీ తగ్గుముఖం పట్టిందని, పండ్ల నాణ్యత తక్కువగా ఉండడంతో నివేదికలు అందుతున్నాయి. జగిత్యాల పట్టణం శివార్లలో ఉన్న చెల్గల్ మామిడి మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. జగిత్యాల మామిడిపండ్లు ప్రసిద్ధి చెందినందున, వేసవిలో పంటను కొనుగోలు చేయడానికి వివిధ ఉత్తర భారత రాష్ట్రాల నుండి వ్యాపారులు కూడా ఇక్కడకు వస్తారు. అయితే, ఈ సంవత్సరం ప్రకృతి విభిన్న ప్రణాళికలను…
భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ వేటు భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్‌పై బుధవారం బీజేపీ సస్పెండ్ వేటు వేసింది. బీహార్‌లో ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినందుకు కమలం పార్టీ సస్పెండ్ చేసింది. పవన్ సింగ్ బీహార్‌లోని కరకత్ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిపై పోటీ చేస్తున్నారు. విత్‌డ్రా చేసుకునేలా బుజ్జగించినా వినకపోవడంతో తాజాగా బీజేపీ అధిష్టానం వేటు వేసింది. ఇదిలా ఉంటే గతంలో పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ టిక్కెట్‌ను…
పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న యం. నాగరాజు తో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపి శ్రీ ఎ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…. కొమురేల్లి ఎస్. ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా…