Teaching Agriculture: భావితరానికి బంగారు బాటలు వేసే ప్రయత్నం చేస్తున్నారు ఓ గిరిజన రైతు. పిల్లలకు వ్యవసాయం నేర్పుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు గిరిజన రైతు లక్కు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం గుర్రగరువులో పాలికి లక్కు అనే గిరిజనుడు వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఉన్న తన పిల్లలకు వ్యవసాయం నేర్పుతున్నాడు. పిల్లలు సెల్‌ఫోన్‌లు, ఆటలు వంటి వాటిలో నిమగ్నమవుతున్న రోజుల్లో వ్యవసాయం నేర్పుతున్న గిరిజన రైతుని పలువురు అభినందిస్తున్నారు. ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో మన్యం వ్యాప్తంగా పొలం పనులు ప్రారంభం అయ్యాయి. పొలం పనుల్లో భాగంగా తన ఆడ బిడ్డ సహా పిల్లలకు పొలం దున్నుతూ, దున్నిస్తూ వ్యవసాయంపై ఆసక్తి కలిగేలా గిరిజన రైతు అవగాహన కల్పిస్తున్నారు. ఇది చూసిన పలువురు తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు కూడా వ్యవసాయం విలువ గురించి నేర్పించేందుకు ముందుకు వస్తున్నారు.
Read Also: Arogyasri: ఏపీలో తిరిగి ప్రారంభమైన ఆరోగ్యశ్రీ సేవలు