రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే'. తెలంగాణ యాస భాష నేపథ్యంలో " అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే " అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ భాగంగా.. మంచు విష్ణు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్‌బాబు, ప్రభాస్ మధ్య కన్వర్జేషన్ ఆకట్టుకుంటుంది.
విచారణకు సహకరించని పోసాని.. అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో లో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విచారణ కొనసాగుతుంది. దాదాపుగా ఐదు గంటల పాటు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, సీఐ వెంకటేశ్వర్లు విచారిస్తున్నారు. అయితే, విచారణకు నటుడు పోసాని కృష్ణ మురళి సహకరించడం లేదు.. ఇప్పటి వరకు ఎటువంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నారు.. ఆయన నోరు విప్పితేనే విచారణ కొనసాగుతుంది అన్నారు.. అలాగే, తాము అడిగిన ప్రశ్నలకు పోసాని తికమక సమాధానం…
పోసానికి తృటిలో తప్పిన ప్రమాదం! సినీ నటుడు పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ వద్ద జీపు దిగి లోపలికి వెళుతూ ఉండగా.. అకస్మాత్తుగా డ్రైవర్ జీపును ముందుకు కదిలించాడు. జీపు తగిలి పోసాని త్రూలి పడబోయారు. పక్కనే ఉన్న పోలీసులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం పోసాని ఓబులవారిపల్లె పీఎస్‌లోకి వెళ్లిపోయారు. ఓబులవారిపల్లె…
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా.. ఇంగ్లండ్- అఫ్ఘానిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠపోరులో ఇంగ్లండ్ పై ఆఫ్గాన్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 49.5 ఓవర్లలో ఇంగ్లండ్ ఆలౌటయ్యారు.
కాంగోలో వింత వ్యాధి.. రెండ్రోజుల్లో 50 మంది మృతి ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన కాంగోలో ఓ వింత వ్యాధి హడలెత్తిస్తుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు 50 మంది మరణించారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన 48 గంటల్లోనే రోగులు మరణిస్తున్నారు. గబ్బిలాలు తిన్న ముగ్గురు పిల్లలలో ఈ వ్యాధి మొదట గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత ఈ వ్యాధికి సంబంధించిన కేసులు వేగంగా పెరగడం…
హిందూ సామ్రాజ్య స్థాపనకు కృషి చేసిన శంభాజీ మహారాజ్ సినిమాను విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడున్నరేళ్ళ తరువాత సినిమా చూశానని.. ఒక వీరుడి సినిమా చూశాననే ఆనందం ఉందన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్.
పండుగ పూట విషాదం.. వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని సూసైడ్! వరంగల్ నగరంలో మహా శివరాత్రి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ములుగు రోడ్డులోని పైడిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత (20) ఆత్మహత్య చేసుకుంది. రేష్మిత ఈరోజు ఉదయం నుంచి రూములో నుండి బయటకు రాకపోవడంతో కాలేజి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. రేష్మిత ఉంటున్న గది వెంటిలేటర్ నుండి పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య…
మేము కూటమిగా కలిసే ఉంటాం.. విడిపోయే ప్రసక్తే లేదు.. ఎందుకు పవన్ ఈ మాట పదే పదే చెబుతున్నారు. దీని వెనక ఉద్దేశం ఏంటి..? కొన్ని అంశాల్లో వచ్చిన విభేదాల వల్ల ఈ మాట చెబుతున్నారా.. లేక వైసీపీ బలపడకూడదు అనే ఉద్దేశం ఉందా..? కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతోంది. కూటమి ఏర్పాటులో పవన్ పాత్ర చాలా కీలకం.
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో అనంతపురం గంగమ్మ తల్లిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా.. మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు.