రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి.. హైదరాబాద్ మియాపూర్ మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థిపై శారీరక దాడి చేసి అతడి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు కలిగించినట్లు తెలుస్తోంది. స్థానిక సమాచారం మేరకు, ఓ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థులపై కర్రతో దాడి చేసిన ఘటనలు ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యార్థి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు…
విశాఖలో నిర్వహించిన బడ్జెట్ పై మేధావుల సమావేశంలో కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో అన్ని వర్గాలకు సమతుల్యం పాటించారు.. రైతులకు పెద్ద పీట వేశారని తెలిపారు. కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు.. వ్యవసాయ పెట్టుబడి సమకూర్చే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కేంద్రం ధన్ వ్యయన్ అనే పథకం తీసుకువచ్చింది.. ఫసల్ బీమా యోజన యధావిధిగా కొనసాగుతోంది.. యూరియా, డీఏపీ ధరల…
కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రామారెడ్డి మండలం స్కూల్ తండాలో ఇద్దరు విద్యార్థినిలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తరగతి గదిలో తోటి విద్యార్థినిల వేధింపుల వల్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
ఏపీలో చెత్త పన్ను రద్దు.. గెజిట్ జారీ ఆంధ్రప్రదేశ్‌లో చెత్త పన్నును ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికారంలోకి వచ్చాక… చెత్త పన్ను రద్దు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గతేడాది డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా మున్సిపల్ చట్ట సవరణ తర్వాత గెజిట్ జారీ అయింది. ఇక నుంచి ఏపీలో చెత్తపై పన్ను ఉండదు.…
ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు.. తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు.. వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ.. అంతేకాదు, 24 గంటల్లోగా ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ…
ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వేసిన ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే.. అదే ఓవర్లో మరో వికెట్ పడాల్సింది. మరో వికెట్ పడి ఉంటే.. ఈరోజు చరిత్రలో మిగిలిపోయేది. వన్డే అంతర్జాతీయ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించి, భారత ఆటగాళ్ల ప్రత్యేకమైన జట్టులో చేరేవాడు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదం కారణంగా అక్షర్ పటేల్ హ్యాట్రిక్ సాధించలేకపోయాడు.
అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీపై సమీక్ష చేశారు. వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాలలో వేసవిలో సరఫరాకు డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ లభ్యత తగినంత పరిమాణంలో ఉందని సీఎస్ కలెక్టర్లకు తెలిపారు.
జనగామ జిల్లా కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పర్యటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఆంధ్రా వాళ్ళను తిట్టి సీఎం అయితే.. రేవంత్ రెడ్డి కేసీఆర్‌ని తిట్టి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు.