తెలంగాణలో భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు క్రమశిక్షణ సంస్కారం నేర్పాల్సిన ఫిజికల్ డైరెక్టర్ విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర ప్రభుత్వ పాఠశాలలో పీఈటీ ఆనంద్ అరాచకం సృష్టించాడు. ఒంట్లో బాగా లేదన్నా వినకుండా 8 మంది విద్యార్థినిలను పీఈటీ చితకబాదాడు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తిపోతల పనులను ఆయన పరిశీలించారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ 2ను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం.. పంప్ హౌస్ 2 నుంచి గోదావరి జలాలను దిగువకు విడుదల చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. టన్నెల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకురావాలంటూ పిల్ దాఖలు చేశారు. నేషనల్ యూనియన్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్ ఈ పిల్ దాఖలు చేసింది.
ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గనుల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేపట్టారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్పోర్ట్ ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఔట్ పోస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఔట్ పోస్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సీపీ అవినాష్ మహంతి, ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ ఫనికర్, సీఐఎస్ఎఫ్డీజి మొహంక్య తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ చింతపండు నీవన్ (తీన్నార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలాకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది.
గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు.. నిధులను డైవర్ట్ చేశారు.. గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ లేదు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలో ఉన్న నిధులు గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది అని ఆరోపించారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోంది అని తేల్చి చెప్పారు. అన్నిటి కంటే ముఖ్యంగా మున్సిపల్ శాఖకు 13 వేల కోట్ల…
Justice Bela Trivedi: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేలా ఎం త్రివేది ఒక కేసు విచారణ సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితురాలిగా ఉన్న ఒక మహిళ బెయిల్ పిటిషన్‌ని ఫిబ్రవరి 27న ఆమె విచారిస్తున్న సందర్భంలో.. ‘‘ మహిళ బరువు తగ్గేందుకు ఆమెను కస్టడీలో ఉంచండి’’ అంటూ వ్యాఖ్యానించారు. నిందితురాలు అధిక బరువుతో బాధపడుతోందని, ఆమె తరుఫు న్యాయవాది కోర్టుకు చెప్పిన సమయంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్యలు చేవారు. ‘‘ఇది ఉపశమనం కోసం కారణం కావాలా..?’’…
సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాక్ నుంచి బెదిరింపులు.. పోలీసుల దర్యాప్తు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. మాలిక్ షాబాజ్ హుమాయున్ రాజా దేవ్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. ముఖ్యమంత్రిపై దాడి చేయబోతున్నట్లు సందేశం యొక్క సారాంశం. ఈ బెదిరింపుపై ముంబైలోని వర్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బెదిరింపుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాట్సాప్‌లో తెలియని నంబర్ నుంచి ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. బెదిరింపు సందేశం…