ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1200 మంది ఫోన్లను టాప్ చేసినట్లు ప్రణీత్‌రావు పేర్కొన్నారు. జడ్జిలు రాజకీయ నేతలు ప్రతిపక్ష నేతలు కుటుంబ సభ్యులు మీడియా పెద్దలు జర్నలిస్టుల ఫోన్లు టాప్ చేసినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు టాప్ చేసినట్లు.. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్న ప్రణీత్‌రావు పేర్కొన్నారు. అధికారికంగా మూడు ఫోన్లు…
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. . రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో…
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ?? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ?? ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?? నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు…
ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ పరీక్షతో జూన్ 9న జరగాల్సిన గ్రూప్-ఐ ప్రిలిమినరీ పరీక్షను రెండు-మూడు వారాల పాటు వాయిదా వేయాలని గ్రూప్-ఐ సర్వీసు అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని డిమాండ్ చేశారు. . అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్ – II/ఎగ్జిక్యూటివ్) రిక్రూట్మెంట్ కోసం ఇప్పటికే టైర్-1 టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు, ఇద్దరి ఘర్షణ కారణంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌లలోకి వచ్చే అవకాశాన్ని కోల్పోకూడదని అన్నారు. సార్వత్రిక…
కేసీఆర్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణం కేసీఆర్ స్వయంకృపరాధమే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మీడియ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ కి ప్రధాన భాద్యుడు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో కేసీఆర్ ఇరుక్కాపోతాడని, కేంద్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు ను CBI విచారణ చేపట్టాలన్నారు. ప్రధానమంత్రి మోడీ దేశం లో మత్తవిద్వేషాలు రెచ్చగొట్టేలా…
వాలీబాల్ బెట్టింగ్ గ్యాంగ్ వార్ కు కారణంగా మారింది. బెట్టింగ్ లో రాజుకున్న వివాదంతో ఓ యువకుడిపై 20 మంది యువకులు దాడికి చేసి చితకబాదారు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ టౌన్ లో చోటు చేసుకుంది. బాధిత యువకుడు సుమన్ తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ లకు ఫిర్యాదు చేశాడు. మిర్యాలగూడ మండలం దిలావర్ పూర్ గ్రామం వాలీబాల్ గేమ్ లో బెట్టింగ్ వివాదానికి…
బయోఎనలిటికల్ ప్రయోజనాల కోసం ప్లాస్మా , రక్తం , సీరం వంటి ఇతర జీవ పదార్థాలను సోర్స్ చేసే హైదరాబాద్‌లోని క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CRO), బయోఎవైలబిలిటీ (BA) , బయోఈక్వివలెన్స్ (BE) స్టడీ సెంటర్లకు TS డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (TSDCA) మంగళవారం సలహా ఇచ్చింది. రక్త కేంద్రాలతో నేరుగా సరైన ఒప్పంద ఒప్పందాలను కుదుర్చుకోవడం. “CDSCO జారీ చేసిన అవసరమైన రిజిస్ట్రేషన్లను కలిగి ఉన్న BA/BE కేంద్రాలు , CROలు BA/BE కేంద్రాలు, CROలు…
తెలంగాణలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా..? లేనట్టా..? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు ?? పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి ఎక్కడ ? ముందుచూపు లేని ముఖ్యమంత్రి జాడేది ?? ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప.. ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా ?? నిన్న.. ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు..! నేడు.. విత్తనాలు కొందామంటే…
నేడు ఒడిశాలో ప్రధాని మోడీ, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారం.. ఒడిశాలో నాలుగు దశల ఎన్నికలలో మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక, ఈ దశ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఒడిశాకు వెళ్తున్నారు. మూడు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు గోలక్ మహపాత్ర వెల్లడించారు. బరిపడ, బాలాసోర్, కేంద్రపరాలలో జరిగే బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగిస్తారని చెప్పారు.…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. రిమాండ్‌లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ను కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టు లో పిటిషన్ వేశారు. కాగా, ఈ కేసులో మూడు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. అధికారులు అతడిని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఉమా మహేశ్వరరావు, మరికొందరు అవినీతి అధికారులతో కలిసి…