నాంపల్లి కోర్టులో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బెయిల్ పిటిషన్ కు దాఖలు చేశారు. గతంలో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో.. మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ…
నేడు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పటిషన్లపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన భుజంరావు, తిరుపతన్న. నేడు హైదరాబాద్‌కు చంద్రబాబు. పోలింగ్ తర్వాత విదేశాలకు వెళ్లిన చంద్రబాబు. అమెరికా నుంచి ఇవాళ ఉదయం 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చంద్రబాబు. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72930 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850 లుగా ఉంది. అలాగే..…
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డీసీపీ రాధాకిషన్ ఫోన్ ట్యాపింగ్‌లో తన పేరు ఉందని చెప్పాడన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని నిన్నటి నుండి చాల బాధపడ్డానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌తో మాజీ ముఖ్యమంత్రి, కేటీఆర్, హారీష్ రావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ నీచాతి నీచమైన చర్య అని మండిపడ్డారు. నా ఫోన్ ట్యాపింగ్…
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రోసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం…
మాజీ క్రికెట్ దిగ్గజం, కేకేఆర్ మెంటర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. గంభీర్‌తో బీసీసీఐ సుధీర్ఘ చర్చలు జరిపినట్లు సమాచారం. గంభీర్‌తో 4 గంటలపాటు బీసీసీఐ సెక్రటరీ జైషా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గంభీర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. కాగా.. ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కి 3 సార్లు టైటిల్ అందించాడు గంభీర్. 2012, 2014లో గంభీర్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కేకేఆర్ కి టైటిల్ అందించి…
హర్యానాలోని సోనిపట్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఆ సమయంలో.. ఫ్యాక్టరీలో ఉన్న సిలిండర్లు మంటలు అంటుకుని పేలాయి. దీంతో.. మంటలు భారీగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా కార్మికులు మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. అయితే.. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకుని ఫ్యాక్టరీలో మంటల్లో చిక్కుకున్న కార్మికులను కొంతమందిని…
ఉదయం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో.. రైతులు షాపుల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. తోపులాట జరగడంతో పోలీసులు చెదరగొట్టారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం స్పందించారు. ఆదిలాబాద్ లో పత్తి విత్తనాల కొనుగోలు కోసం దుకాణాల వద్దకు వచ్చిన…
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జూన్ 2న జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్స వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు. అనంతరం.. పలు విషయాలపై చర్చించనట్లు సమాచారం. కాసేపటి క్రితమే సోనియా గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకీలకంగా వ్యవహరించారు. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో మెరుపు దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల డబ్బులు ఎక్కడికి రవాణా అవుతుంటే అక్కడికి వెళ్లి పట్టుకున్నారు తిరుపతన్న. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డబ్బు చేరకుండా దాడులు చేసి పట్టుకున్నారు.