డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్‌కి చేరుకుంటారు. గురువారం ఉదయం భువనేశ్వర్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి భద్రలోక్ పార్లమెంట్ నియోజకవర్గంలో యువ నేత రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. గత వారం రోజులపాటు పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రచారం నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు.
హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరు అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసివేయడానికి నిరసిస్తూ ఖిలా వరంగల్‌లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలన దీక్షకు ప్రతీక అయిన కాకతీయ కళా తోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తన్నట్టు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, వినయ్ భాస్కర్,…
నల్గొండ, సూర్యాపేట జిల్లాలో తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం, నకిలీ వైద్య వ్యవస్థ ద్వారా వైద్య పరంగా.. ఎటువంటి విద్యార్హత లేకుండా పేద ప్రజల అవసరాలను అవకాశంగా తీసుకొని నిలువు దోపిడీ చేస్తున్న వచ్చి రాని వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులను గుర్తించి NMC చట్టం ప్రకారం తెలంగాణ వైద్య మండలి అధికారులు కేసులు నమోదు చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. పలు నంబర్ల నుండి ఫోన్ వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా.. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ నెంబర్లను కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కాగా.. బెదిరింపు కాల్స్ పై ఆయన స్పందించారు. ఈ కాల్స్ తనకు కొత్తేమీ కాదని.. వీటిపై గతంలో ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. అయినా…
తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రి నివాసానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వచ్చారు. తెలంగాణా గీతం, తెలంగాణ లోగో ఎంపిక పై వారిద్దరూ చర్చిస్తున్నారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలో.. గీతం రూపకల్పనపై కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్ష చేపట్టారు. సాయంత్రం వరకు పాటకు సంబంధించి…
బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. నిందితుడు గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించి.. అతన్ని అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పంజాగుట్ట ప్రజా భవన్ లో, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టాము అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి టెన్షన్ క్రియేట్ చేశాడు రామకృష్ణ. అయితే.. నిందితుడు భార్యతో గొడవ పడి మధ్యనికి బానిసగా మారి, భార్య లేదన్న బాధలో…
ప్రజల దృష్టి మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్‌ను తెర పైకి తీసుకువస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. సర్కస్‌లో జోకర్‌గా అవసరం అయినప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంను తీసుకువస్తున్నారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఇప్పటి వరకు సీఎం, మంత్రులు మాట్లాడలేదు.. కానీ లీకులు మాత్రమే ఇస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో చట్టపరంగా జరగాల్సింది జరుగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.…
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విత్తన షాపుల వద్ద రైతులు పాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి ఎండలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆధార్ కార్డు, పాస్ పుస్తకాలు చేత పట్టుకొని విత్తనాల కోసం క్యూ కట్టారు. మండుతున్న ఎండలో విత్తనాల కోసం రైతుల కష్టాలు పడుతున్నారు. కొద్ది షాపుల్లో స్టాక్ ఉండటంతో.. రైతులు భారీగా బారులు తీరారు. ఎండను సైతం లెక్క చేయకుండా నిలబడితే కేవలం ప్యాకెట్లు ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 659 అనే రకం…
అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుర్కపల్లి జినోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం 2023లో శామీర్ పేట్ గ్రామానికి చెందిన దూడల నాగేష్ గౌడ్ అనే వ్యక్తి దగ్గర రూ.6 లక్షలు అప్పుగా…