తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఏసీబీ అధికారులు మారువేషాల్లో వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. లారీ డ్రైవర్లుగా వేషం మార్చుకుని చెక్‌పోస్ట్‌ల దగ్గర తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టులలో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ శివారులో పసి పిల్లల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేడిపల్లి కేంద్రంగా పసి పిల్లల అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఇతర రాష్ట్రాల నుంచి పిల్లల్ని తెచ్చి పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్ముతున్నాడు. ఒక్కో పిల్లాడిని రూ. 5 లక్షల వరకు అమ్ముతుంది ఈ ముఠా. ఈ విషయం తెలుసుకున్న బాలల హక్కుల సంఘం ఈ విషయాన్ని గుట్టురట్టు చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. దీంతో.. పోలీసులు అక్కడికి చేరుకుని ముఠాను అరెస్ట్ చేశారు.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్‌కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసీపీ మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన…
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది అని తాను ముందే చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టామని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని.. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం…
పిఠాపురం ట్రెండింగ్‌లో ఉన్న సెగ్మెంట్.. ప్రచారం ఎంత హోరాహోరీగా జరిగిందో.. పోలింగ్ కూడా అంతే ఆసక్తిగా సాగింది.. ఎన్నికల ఫలితాల ముందు అదికాస్త పీక్స్‌కు చేరుకుంది. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు.. మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్ చేయిస్తున్నారు. ఇలా తిరుగుతున్న వాహనాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పిఠాపురంలో ఆధిపత్యపోరు ఓ…
ఫలితాలు వచ్చే ముందు తాత్కాలిక ఆనందాలకు మేము వెళ్లడం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెట్టింగ్ లో కోసం,సోషల్ మీడియా లో ప్రచారం కోసం మేము ప్రయత్నాలు చేయడం లేదని, నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చని, ఉద్యోగులంతా తమ వెనుకే…
తాత జయంతి..ఎన్టీఆర్ ట్వీట్ వైరల్.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు గారి గురించి తెలియని వారు వుండరు.నటుడుగా ఎన్నో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.తెలుగు భాష ఖ్యాతిని ఉన్నత స్థాయికి తీసుకోని వెళ్లిన ఘనుడు ఎన్టీఆర్.ఎన్టీఆర్ నటుడుగా ,నాయకుడుగా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయారు.తెలుగు సినీ రంగంలో ఎన్టీఆర్ “యుగపురుషుడుగా” నిలిచారు.సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా అద్భుతముగా రాణించి అందరి చేత శబాష్ అనిపించుకున్నారు.నేడు మే 28 స్వర్గీయ నందమూరి తారక…
ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలోని మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాఖలైన మూడు అదనపు కేసుల్లో రాష్ట్ర హైకోర్టు మంగళవారం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జూన్ 5న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరాదని హైకోర్టు ఆదేశించింది. నాలుగు రోజుల క్రితం ఈవీఎం పగులగొట్టిన కేసులో కోర్టు నుంచి ఉపశమనం పొందిన కొద్దిసేపటికే పోలీసులు తనపై మూడు…
తమిళనాడులోని తిరుచ్చిలో ఇరుకైన రోడ్డు డివైడర్‌పై ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా, ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమైంది. రోడ్డు భద్రత, స్టంట్ డ్రైవింగ్ పై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వైరల్‌గా మారిన వీడియోలో , తిరుచ్చిలోని కొల్లిడం నది వంతెనపై రహదారికి ఇరువైపులా భారీ ట్రాఫిక్ మధ్య ఇరుకైన రోడ్డు డివైడర్‌పై ఒక యువకుడు తన బైక్‌ను నడుపుతున్నట్లు చూడవచ్చు. ఆ యువకుడు హెల్మెట్ కూడా ధరించకుండా ఈ ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ తన ప్రాణాలను పణంగా పెట్టాడు.…