దేశంలో విమానాశ్రయాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా.. ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపుల కాల్ వచ్చింది. శుక్రవారం నాడు 177 మంది ప్రయాణికులు, ఒక శిశువుతో శ్రీనగర్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో.. విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే.. విమానయాన సంస్థ, భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా.. ఢిల్లీ నుండి బయలుదేరిన ఫ్లైట్ నెం-UK-611.. సుమారు రాత్రి 12:10 సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.
Read Also: TSCAB Chairman Resigned: టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్ రావు రాజీనామా
విమానానికి బెదిరింపులు వచ్చిన క్రమంలో ప్రామాణిక ప్రోటోకాల్‌ను అనుసరించి.. విమానం ల్యాండింగ్ అయిన వెంటనే ఐసోలేషన్ బేకు మళ్లించారు. “ప్రయాణికులందరినీ ఐసోలేషన్ బేలో సురక్షితంగా డి-బోర్డింగ్ చేశారు. ప్రస్తుతం సంబంధిత అధికారులందరు భద్రతను నిర్ధారించడానికి విమానంలో క్షుణ్ణంగా భద్రతా తనిఖీలు జరుగుతున్నాయి” అని విమానాశ్రయ అధికారి ఓ మీడియా సంస్థకు తెలిపారు.
Read Also: Bribe: లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అవినీతి తిమింగలాలు
అంతరాయం ఉన్నప్పటికీ.. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. బాంబు బెదిరింపుకు సంబంధించిన సమాచారంపై అధికారులు విచారణ చేస్తున్నారు. విమాన ప్రయాణంలో భద్రతను నిర్ధారించడానికి అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు.