ACP Umamaheshwar Rao: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఏసీపీ ఉమామహేశ్వరరావు ఏసీబీ కస్టడీ నేటితో ముగయనుంది. కాగా.. రిమాండ్‌లో ఉన్న ఏసీపీ ఉమామహేశ్వరరావు ను కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టు లో పిటిషన్ వేశారు. దీంతో.. ఈ కేసులో మూడు రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావుని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న ఉమా మహేశ్వరరావు, మరికొందరు అవినీతి అధికారులతో కలిసి అక్రమాస్తుల పేర్లు, పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉమామహేశ్వర్‌రావు టీమ్ సీసీఎస్‌లో హై ప్రొఫైల్ కేసులను మాత్రమే టార్గెట్ చేసిందన్నారు. ఉమామహేశ్వర్‌రావు పలు కేసుల్లో సెటిల్‌మెంట్లు చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
Read also: Warangal: నిండు ప్రాణాన్ని బలిగొన్నరెండు ప్రైవేట్ ఆస్పత్రులు
కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వర్ రావు అవినీతిలో కొందరు పోలీసు అధికారుల హస్తం ఉన్నట్లు ఏసీబీ అధికారులు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. కాగా.. మూడు రోజుల కస్టడీ విచారణలో ఉమామహేశ్వర్ రావు ఏసీబీకి సహకరించ లేదని తెలిపారు. ఏసీబీ అడిగిన ప్రశ్నలకు ఉమామహేశ్వర్ రావు సమాధానాలు చెప్పలేదని వెల్లడించారు. ఉమామహేశ్వర ఇంట్లో దొరికిన నగదు, ల్యాండ్ డాక్యుమెంట్లపై ఉమామహేశ్వరరావు నోరు మెదపడం లేదని అన్నారు. అయితే నేటితో ఉమామహేశ్వరరావుని 3 రోజుల పాటు కస్టడీ ముగయడంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
Gangs Of Godavari Review: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ