ఏపీ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 6న ఏపీలో 111, తెలంగాణలో 2 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 48,828 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 44,446 మంది పరీక్షలకు హాజరయ్యారు.
ఎన్నికల కౌంటింగ్కు సిద్ధంగా ఉన్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశామని.. 17 నుంచి 26 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుందన్నారు.
ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.. తనను ప్రేమించాలంటూ యువతిపై కత్తితో దాడికి పాల్పడి హత్య చేసి.. తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఏలూరు జిల్లా సత్రంపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రేమ విఫలం కావడంతో యువతి పీక కోసి ఓ యువకుడు కిరాతకంగా హత్య చేశాడు.
Mallu Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు నేడు ఒరిస్సాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి భువనేశ్వర్కి చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం
తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని పార్కింగ్ స్థలంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 16 కార్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 1.17 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. తొమ్మిది అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. వివరాల ప్రకారం.. పార్కింగ్ స్థలంలో అద్దె ప్రాతిపదికన తమ వాహనాలను పార్క్ చేసే స్థానికులకు చెందిన కార్లు అని…
జీడిమెట్ల పియస్ పరిధిలోని న్యూ ఎల్బీనగర్ లో దారుణం జరిగింది. షాపూర్ నగర్, ఎన్ ఎల్బీనగర్ లో నివాసం ఉండే అఖిల (22) అనే అమ్మాయిని అదే ప్రాంతంలో నివాసం ఉండే అఖిల్ సాయిగౌడ్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. తొలుత అఖిల ప్రేమను తిరస్కరించడంతో.. చనిపోతానని అఖిల్ గౌడ్ బెదిరించడంతో తప్పని పరిస్దితిలో అఖిల ప్రేమించింది. ఈ మధ్య అఖిల్ గౌడ్ అఖిలతో చిన్నచిన్న విషయాలపై గొడవపడి రోడ్డుపై వేధించడం ప్రారంభించాడు. పెళ్ళి చేసుకోనని తేల్చిచెపడంతో అఖిల…
నల్గొండ రూపురేఖలను మార్చేసే నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈపీసీ పద్ధతిలో రూ.524.85 కోట్లతో నిర్మించ తలపెట్టిన ప్రతిష్టాత్మకమైన ఈ బైపాస్ రోడ్డుకు సంబంధించిన ప్రస్తుత స్థితిగతులపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాలుగు లేన్లుగా 14 కి.మీ నిర్మిస్తున్న ఈ రోడ్డును ఎలక్షన్ కోడ్ ముగియగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా పూర్వపనులను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో అవసరమైన విత్తనాల సరఫరా తగినంతగా ఉండేలా విత్తన కంపెనీలతో ఫిబ్రవరి, మార్చి మాసంలో వరుస సమావేశాలు నిర్వహించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2023-24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా.. ఈ వానా కాలానికి 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు కాగలదని అంచనా వేసి 1.24 కోట్ల పత్తివిత్తన ప్యాకేట్లను రైతులకు అందుబాటులో ఉంచడానికి మార్చి మాసంలోనే ప్రణాళిక చేయడం జరిగిందని.. దానికనుగుణంగా ఈరోజు వరకు…