బకాయిలు చెల్లించలేదని ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. కర్ణాటక రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ (KRIDL) పూర్తి చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. దావణగెరెకు చెందిన కాంట్రాక్టర్ ప్రసన్న (50) సంతాబెన్నూరులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మనోవేదనలను వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాశాడు.
Read Also: AP High Court: పోస్టల్ బ్యాలెట్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు..
ఆ నోట్లో KRIDL కంపెనీ, అతని ఇద్దరు సోదరులు.. నాగరాజ్, శ్రీనివాస్‌లకు ఎక్కువ మొత్తంలో డబ్బులు బకాయిపడ్డారని ఆరోపించాడు. అతని సోదరులు, KRIDL కంపెనీకి ఇచ్చిన డబ్బులు మొత్తం రూ. 80 లక్షలు దాటిందని.. అయితే ఆ డబ్బులను ఇవ్వకపోవడం వల్ల తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఈ క్రమంలో.. బాధితుడి భార్య కేఆర్‌ఐడీఎల్ అధికారులు, శ్రీనివాస్, నాగరాజ్‌లపై ఫిర్యాదు చేసింది.
Read Also: Rohit Sharma: వేచి ఉండలేనంటున్న టీమిండియా కెప్టెన్.. వీడియో..
ఈ ఘటనపై దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ మాట్లాడుతూ.. కేఆర్‌ఐడీఎల్ అధికారులు, శ్రీనివాస్, నాగరాజ్ తీసుకున్న డబ్బు ఇవ్వకపోడం వల్ల బాధితుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కాగా.. ఈ విషయంపై మృతుడి భార్య ఫిర్యాదు చేసిందని.. నిందితులందరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్టర్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోందని పేర్కొన్నారు.